logo

ఆటకు చోటేది..?

నగరంలో సరిపడా క్రీడామైదానాలు లేక.. బస్తీలు, కాలనీల్లో ఖాళీగా ఉన్న స్థలాలే యువతకు దిక్కవుతున్నాయి. ఆదివారం వస్తే అక్కడ కిక్కిరిసిపోతున్నారు.

Published : 08 Feb 2023 02:40 IST

వసతులు లేని మైదానాలతో యువత ఉత్సాహానికి ఆటంకాలు

హైటెక్స్‌ దారిలో మైదానం పరిస్థితి

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో సరిపడా క్రీడామైదానాలు లేక.. బస్తీలు, కాలనీల్లో ఖాళీగా ఉన్న స్థలాలే యువతకు దిక్కవుతున్నాయి. ఆదివారం వస్తే అక్కడ కిక్కిరిసిపోతున్నారు. ఎకరా స్థలంలో 6 జట్లు క్రికెట్‌ ఆడేస్తుంటాయి. నెట్‌ లేకుండానే వాలీబాల్‌ ఆడేస్తుంటారు. ఒకరు కొట్టిన బంతి మరొకరికి తగిలి విలవిల్లాడుతున్నారు.

ఏమాత్రం ఖాళీ జాగా ఉన్నా.. డబ్బున్నవారు అకాడమీల్లో చేరిపోతున్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతరం ఇళ్ల మధ్యన ఖాళీగా ఉన్న కొద్దిపాటి స్థలాల్లో కసితీరా ఆడలేక.. సామర్థ్యానికి సానపెట్టలేక సాదాసీదా ఆటగాళ్లుగా మిగిలిపోతున్నారు. పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాధాపూర్‌, కొండాపూర్‌ వరకూ 15 కిలోమీటర్ల పరిధిలో ఒక్క క్రీడామైదానం లేని పరిస్థితి. మాధాపూర్‌లోని హైటెక్స్‌దారిలో ఖాళీ స్థలం ఆదివారం వచ్చేసరికి నిండిపోతోంది. 20 మందేసి జట్లుగా ఏర్పడి ఆడుతున్నారు.


ప్రతి 5 కిలోమీటర్లకు క్రీడామైదానం కావాలి

- సాయిప్రసాద్‌, సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారుడు

ఆఫ్రోఆసియన్‌ క్రీడల కోసం దశాబ్దాల క్రితం కట్టిన క్రీడా మైదానాలు తప్ప ఆ స్థాయి ఏర్పాట్లు ఒక్కటి కూడా జరగలేదు. నగరంలో చిన్న పార్కుల్లో ఓపెన్‌ జిమ్‌లు పెడుతున్నా అవి ప్రారంభించిన తర్వాత వాటివైపే చూడడంలేదు. 90 శాతం ప్రైవేటు పాఠశాలలకు క్రీడామైదానాలే లేవు. యువతరాన్ని ప్రోత్సహించాలంటే ప్రతి 5 కిలోమీటర్లకు అన్ని క్రీడలకు అనువైన క్రీడామైదానం, శిక్షకులు ఉండాలి. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించి.. యువత ఉత్సాహాన్ని నీరుగార్చకుండా.. వారిలో చక్కటి క్రీడాస్ఫూర్తిని నింపేలా జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించేలా చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని