కొత్త ఠాణాలకు కష్టమే
నగరంలోని మూడు కమిషనరేట్లలో కొత్త ఠాణాల ఏర్పాటు.. ఎప్పుడన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్నగా మారింది.
నగరంలో 24 పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు ఆమోదముద్ర
తాజా బడ్జెట్‌లో భవనాల నిర్మాణానికి దక్కని నిధులు
రాచకొండ కమిషనరేట్ నిర్మాణానికి నారపల్లిలో కేటాయించిన స్థలం
ఈనాడు, హైదరాబాద్: నగరంలోని మూడు కమిషనరేట్లలో కొత్త ఠాణాల ఏర్పాటు.. ఎప్పుడన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్నగా మారింది. 2023-24 బడ్జెట్ కేటాయింపులే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండను పునర్ వ్యవస్థీకరించి కొత్త పోలీస్‌ష్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపినా.. అవి కార్యరూపం దాల్చేందుకు బడ్జెట్‌లో తగిన నిధులు ప్రస్తావించకపోవడమే దీనికి ప్రధాన కారణం. మూడు కమిషనరేట్లలో కలిపి కొత్త ఠాణాలు, భవనాలు, క్వార్టర్ల నిర్మాణానికి కేవలం రూ.8.64 కోట్లు కేటాయించడం చూసి అధికారులే విస్తుపోతున్నారు. నగరంలో కొత్తగా 10 జోన్లు, 24 శాంతిభద్రతల ఠాణాలు, 5 ట్రాఫిక్ ఠాణాల ఏర్పాటుకు ఆమోద ముద్ర లభించింది. కొత్త జోన్లకు డీసీపీలను నియమించింది. ఈ నేపథ్యంలో ఠాణాల ఏర్పాటు.. భవనాల నిర్మాణం అంతే వేగంగా జరుగుతుందని అధికారులు ఆశించారు. అందుకు విరుద్ధంగా నూతన ఠాణాల భవనాల నిధులపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో ఇవి కార్యరూపం దాల్చడం కత్తిమీద సామేనని అధికారులు చెబుతున్నారు.
రాచకొండకు కష్టమే.. రాచకొండ కమిషనరేట్ భవన నిర్మాణానికి 2019లో శంకుస్థాపన చేసినా ప్రహరీ మాత్రమే నిర్మించారు. కొత్త జోన్లకు నియమితులైన డీసీపీలు అరకొర సౌకర్యాలతో కూడిన కార్యాలయాల్లోనే కొనసాగుతున్నారు. ఇటీవల ఏర్పాటైన మహేశ్వరం జోన్ డీసీపీ కార్యాలయాన్ని పహాడీషరీఫ్ ఠాణాలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఠాణాల భవనాల నిర్మాణానికి రూ.8.59 కోట్లు కేటాయించినా.. అందులోనూ ఎక్కువగా ఇప్పటికే నిర్మాణంలో కొన్ని భవనాలను పూర్తి చేసేందుకు ప్రతిపాదించినట్లు తెలిసింది.
నూతన శాంతిభద్రతల ఠాణాలు..
హైదరాబాద్: దోమల్‌గూడ, ఖైరతాబాద్, వారాసిగూడ, తాడ్‌బన్, బండ్లగూడ, ఐఎస్‌సదన్, టోలిచౌకి, గుడిమల్కాపూర్, మాసాబ్‌ట్యాంక్, ఫిల్మ్‌నగర్, రహ్మత్‌నగర్, బోరబండ.
సైబరాబాద్: అల్లాపూర్, జీనోమ్‌వ్యాలీ, సూరారం, షాద్‌నగర్ పట్టణం, అత్తాపూర్, కొల్లూరు, మోకిల.
రాచకొండ: చర్లపల్లి, నాగోల్, న్యూ హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ, పోచారం ఐటీ కారిడార్, ఉప్పల్ మహిళా ఠాణా
కొత్త ట్రాఫిక్ ఠాణాలు..
సైబరాబాద్ : రాయదుర్గం.
రాచకొండ : మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, జవహర్‌నగర్, ఘట్‌కేసర్
కొత్త ఠాణాలకు నిధుల కేటాయింపులు
హైదరాబాద్: రూ.8.59 కోట్లు
సైబరాబాద్: రూ.5 లక్షలు
రాచకొండ: -
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral-videos News
Viral Video: చెన్నై అమ్మాయిల సరదా పని..! బకెట్లు.. డబ్బాలు.. కుక్కర్లతో కాలేజీకి..
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్‌లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
World News
Espionage: రష్యాలో అమెరికన్ జర్నలిస్టు అరెస్టు.. ప్రచ్ఛన్న యుద్ధానంతరం మొదటిసారి!
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
Sports News
IPL 2023: ‘ఈ సీజన్లో ఛాంపియన్‌గా నిలిచేది ఆ జట్టే’.. ముంబయి, చెన్నైలకు నో ఛాన్స్!
-
Movies News
Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో డిలీట్.. కారణమదేనా?