logo

ఆమోదం దిశగా కంటోన్మెంట్‌ బిల్లు?

కంటోన్మెంట్‌ నూతన చట్టం-2020 బిల్లు ఆమోదం పొందే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Published : 08 Feb 2023 02:40 IST

కార్ఖానా, న్యూస్‌టుడే: కంటోన్మెంట్‌ నూతన చట్టం-2020 బిల్లు ఆమోదం పొందే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు గట్టెక్కే దిశగా అడుగులు పడుతున్నాయి.  కొన్ని దఫాలుగా పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లు వరుసగా వాయిదాపడుతూ వస్తోంది. ఈలోగా విలీన అంశం తెరపైకి వచ్చింది. దీంతో నూతన బిల్లు ఆమోదం, బోర్డు ఎన్నికలు లేనట్లేనా? అని ఇక్కడి నేతలు నిరుత్సాహానికి గురయ్యారు.

మరోసారి కొనసాగింపు

ప్రస్తుతం కంటోన్మెంట్‌ బోర్డుకు సంబంధించి బోర్డు అధ్యక్షుడు, సీఈవో, నామినేటేడ్‌ సభ్యుడితో వెరీ బోర్డు నడుస్తోంది. ఈనెల 10తో ఈ బోర్డు కాలపరిమితి ముగియనుంది. ఈనేపథ్యంలో సోమవారం దేశంలోని దాదాపు 56 కంటోన్మెంట్‌లతోపాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డుకు సైతం బోర్డు కాలపరిమితిని మరో ఆరు నెలలు పొడిగించారు. దీంతో బోర్డు నామినేటేడ్‌ సభ్యుడి కాలపరిమితిపై స్పష్టత వచ్చింది. ఇక  బోర్డు నూతన చట్టం,  ఎన్నికలపై స్పష్టత రావాల్సి ఉంది.

* నూతన చట్టం అమలైతే బోర్డు ఎన్నికలూ వేసవిలోనే వచ్చే అవకాశాలుంటాయని పేర్కొంటున్నారు. రాజకీయపరంగానూ మార్పులు జరిగే అవకాశాలుంటాయి. పాత చట్టంలో సభ్యులుగా గెలుపొందినవారు ఉపాధ్యక్షుడిని ఎన్నుకునేవారు. నూతన చట్టం ప్రకారం ప్రజలే నేరుగా ఉపాధ్యక్షుడిని ఎన్నుకునే వీలుంటుంది. పార్టీలకు గుర్తులు సైతం వచ్చే అవకాశముంటుంది.


అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి

- మధుకర్‌ నాయక్‌, సీఈవో, కంటోన్మెంట్‌ బోర్డు

కొన్ని దఫాలుగా పార్లమెంట్‌లో కంటోన్మెంట్‌ నూతన చట్టం బిల్లు పెండింగ్‌లో ఉన్న విషయం వాస్తవమే. ఈసారి బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందే అవకాశం 100శాతం ఉన్నట్లే. బిల్లు ఆమోదం తరువాత ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. విలీన ప్రక్రియ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని