logo

భార్య డబ్బులివ్వలేదని భర్త బలవన్మరణం

శుభకార్యానికి వెళ్లడానికి భార్య డబ్బు ఇవ్వలేదనే మనస్తాపంతో భర్త  బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Published : 08 Feb 2023 02:18 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శుభకార్యానికి వెళ్లడానికి భార్య డబ్బు ఇవ్వలేదనే మనస్తాపంతో భర్త  బలవన్మరణానికి పాల్పడ్డాడు. శంషాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.శ్రీధర్‌కుమార్‌ తెలిపిన కథనం ప్రకారం.. బహదూర్‌గూడకు చెందిన కుండే సిద్ధేశ్వర్‌(50) కాపలాదారు. ఈ నెల 5న ఓ విందుకు వెళ్లడానికి డబ్బు కావాలని భార్యను అడగ్గా.. ఆమె లేవనడంతో మనస్తాపం చెందాడు. అప్పటి నుంచి ముభావంగా ఉంటూ పలుమార్లు ఉరేసుకోవడానికి యత్నించగా కుటుంబసభ్యులు అడ్డుకుంటున్నారు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు