మొయినాబాద్‌లో బాల్య వివాహం
బాల్య వివాహం కేసులో పలువురిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మొయినాబాద్, న్యూస్‌టుడే: బాల్య వివాహం కేసులో పలువురిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై లింగ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు.. భార్య ఆరేళ్ల కిందట మృతి చెందగా.. పిల్లలు నానమ్మ సంరక్షణలో ఉంటున్నారు. పెద్ద కుమార్తెకు సంవత్సరం కిందట వివాహం చేయగా.. చిన్న కుమార్తె(ఆధార్ కార్డులోని వివరాల ప్రకారం వయసు 13)ను ఇదే మండలంలోని మరో గ్రామానికి చెందిన వ్యక్తి(23)కి ఇచ్చి ఈ నెల 5న గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేశారు. బాలిక ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. వివాహ సమాచారం అందుకున్న అంగన్‌వాడీ టీచర్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారించి, కేసు నమోదు చేసి, పలువురిని అరెస్టు చేశారు. బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారు. దీనిపై ‘న్యూస్‌టుడే’ కొందరు గ్రామస్థులతో మాట్లాడగా.. బాలిక నానమ్మకు వయసు మీదపడటం, సంరక్షించేవారు లేకపోవడంతో వివాహం చేశారన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: కలుషిత నీరు తాగిన కూలీలు.. 24 మందికి అస్వస్థత
-
Crime News
Crime News: పెద్దలు అడ్డుచెప్పారని.. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య!
-
India News
Wayanad bypoll: వయనాడ్ ఉప ఎన్నిక.. సీఈసీ ఏం చెప్పారంటే..?
-
Politics News
Komatireddy: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ జరిపించాలి: కోమటిరెడ్డి
-
Movies News
Samantha: చేయని నేరానికి నేనెందుకు ఇంట్లో కూర్చోవాలి.. విడాకులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
-
Sports News
Sachin - Razzak: వీరే డేంజరస్ బ్యాటర్లు.. సచిన్‌కు రెండో ర్యాంక్.. అతడిదే తొలి స్థానం: రజాక్