మద్యం తాగించి బాలికపై సామూహిక అత్యాచారం
బాలికకు మద్యం తాగించిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఐదుగురు నిందితుల అరెస్ట్
చాంద్రాయణగుట్ట: బాలికకు మద్యం తాగించిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఛత్రినాక ఠాణా పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీకి చెందిన ఒక బాలిక (15) ఈ నెల 4న మందుల కొనుగోలుకు హోల్‌సేల్ మెడికల్ దుకాణం వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న ఓ యువతి తక్కువ ధరకు మందులు ఇప్పిస్తానంటూ ఆ బాలికను కందికల్ బోయిగూడలోని ఒక ఇంటికి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ ముగ్గురు యువకులు గంజాయి మత్తులో ఉన్నారు. బాలికతో ముందుగా హుక్కా పీల్పించారు. తర్వాత శీతల పానీయంలో మద్యం కలిపి తాగించారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో బిగ్గరగా కేకలువేసింది. అరుపులు వినిపించకుండా మ్యూజిక్ సిస్టంలో సౌండ్ పెంచారు. బాలిక మత్తులోకి జారుకోగానే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తప్పించుకొని ఇంటికి వచ్చిన బాలిక తన తల్లికి విషయం చెప్పటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీసీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిందితులను గుంటూరు జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు యువకులతోపాలు సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad: సిగ్నల్ ఫ్రీగా ఎల్బీనగర్.. కూడలికి శ్రీకాంతాచారి పేరు : కేటీఆర్
-
Crime News
Hyderabad: విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య
-
General News
Rahul Gandhi: ‘సేవ్ రాహుల్ గాంధీ, సేవ్ డెమోక్రసీ’.. ఓయూలో నిరసన ర్యాలీ
-
India News
Sukesh- Jacqueline: ‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచి సుకేశ్ మరో ప్రేమ లేఖ
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
PAK vs AFG: చరిత్ర సృష్టించిన అఫ్గానిస్థాన్.. పాకిస్థాన్‌పై తొలి విజయం