logo

సెవెన్‌హిల్స్‌ ‘మానిక్‌చంద్‌’ నిర్వాహకుడిపై కేసు నమోదు

నగరానికి చెందిన గుట్కా వ్యాపారి అభిషేక్‌ ఆవల కోసం ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు నగరానికి వచ్చారు.

Published : 08 Feb 2023 02:23 IST

నగరానికి వచ్చిన ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: నగరానికి చెందిన గుట్కా వ్యాపారి అభిషేక్‌ ఆవల కోసం ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు నగరానికి వచ్చారు. ఆ రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారిని మోసం చేసిన ఘటనలో పోలీసులు ఇక్కడికి వచ్చారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లో నివసించే సెవెన్‌హిల్స్‌ మానిక్‌చంద్‌ గుట్కా సంస్థ నిర్వాహకుడైన అభిషేక్‌ ఆవల ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్‌ జైసింగానీకి పొగాకు ఉత్పత్తులకు సంబంధించి డీలర్‌షిప్‌ ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగానే అతని నుంచి రూ.70 లక్షల వరకు తీసుకున్నాడు. డీలర్‌షిప్‌ ఇవ్వకపోవడంతో దీపక్‌ జైసింగానీ రాయపూర్‌లోని గోల్‌బజార్‌ ఠాణాలో గత నవంబరులో ఫిర్యాదు చేయగా మోసం కేసు నమోదు చేశారు. ఈ మేరకు అతన్ని అరెస్ట్‌ చేసేందుకు మంగళవారం నగరానికి చేరుకున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసుల సాయంతో అభిషేక్‌ నివాసానికి వెళ్లారు. నిందితుడు ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. ఇటీవల ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నందకుమార్‌ మానిక్‌చంద్‌ బ్రాండ్‌ కొనుగోలు పేరుతో మోసానికి పాల్పడ్డాడంటూ అభిషేక్‌ ఆవల బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని