logo

మెస్‌ఛార్జీలు, స్కాలర్‌షిప్‌లు పెంచలేదు

రాష్ట్ర బడ్జెట్‌లో పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్‌ఛార్జీలు, స్కాలర్‌షిప్‌ల పెంపు ప్రస్తావన లేదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి విమర్శించారు.

Published : 08 Feb 2023 02:40 IST

మాట్లాడుతున్న అంజి

కాచిగూడ, న్యూస్‌టుడే: రాష్ట్ర బడ్జెట్‌లో పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్‌ఛార్జీలు, స్కాలర్‌షిప్‌ల పెంపు ప్రస్తావన లేదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి విమర్శించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలకు రూ.3,500 కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం కాచిగూడలో జరిగిన బీసీ విద్యార్థి సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. యూనివర్సిటీలకు నిధులు కేటాయించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. నేతలు చింతం శ్రీకాంత్‌, నిఖిల్‌పటేల్‌, సతీశ్‌, సంపత్‌, పవన్‌కుమార్‌, నాగార్జున పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని