వారం రోజుల్లో కూతురి పెళ్లి.. పత్రికలు పంచేందుకు వెళ్లి తండ్రి దుర్మరణం
కుమార్తె పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి తండ్రి దుర్మరణం చెందిన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది.
లక్ష్మణ్
శామీర్‌పేట, న్యూస్‌టుడే: కుమార్తె పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి తండ్రి దుర్మరణం చెందిన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేటకు చెందిన లక్ష్మణ్(49)కు భార్య ఇద్దరు కుమార్తెలు, మరుగుజ్జు కుమారుడున్నారు. పెద్ద కూతురు వివాహం ఈ నెల 13న జరగాల్సి ఉంది. ద్విచక్రవాహనంపై సోమవారం రాత్రి మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో బంధువులకు పత్రికలు ఇచ్చి ఇంటికి తిరిగొస్తున్నారు. ఈ క్రమంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద కుక్క అడ్డొచ్చింది. ద్విచక్రవాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న గ్రామానికి చెందిన రాములమ్మను ఢీకొట్టి కింద పడ్డారు. ఆమె గాయాలతో బయటపడ్డారు. లక్ష్మణ్ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. 108లో సిద్దిపేట జిల్లా లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందారు. పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. రోజు వారి కూలీగా చేస్తూ.. కుటుంబాన్ని పోషించేవారని.. ఇంటి పెద్ద మృతితో కుటుంబం రోడ్డున పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi : రాహుల్పై వేటు నిలబడుతుందా..
-
Ap-top-news News
Vande Bharat Express : తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Crime News
చిలుక వాంగ్మూలంతో.. హత్యకేసు నిందితులకు జీవితఖైదు
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్సభ సచివాలయం
-
Politics News
‘షాపూర్జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’
-
Sports News
కోహ్లి దంపతుల ‘సేవ’.. కొత్త ఎన్జీవోకు శ్రీకారం