logo

‘ఐటీఐఆర్‌పై రాష్ట్రానిది అసత్య ప్రచారం’

ఐటీఐఆర్‌ ప్రాజెక్టు విషయమై భారాస ప్రభుత్వం కేంద్రంపై అసత్య ప్రచారం చేస్తోందని భాజపా ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఆరోపించారు.

Published : 08 Feb 2023 02:40 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: ఐటీఐఆర్‌ ప్రాజెక్టు విషయమై భారాస ప్రభుత్వం కేంద్రంపై అసత్య ప్రచారం చేస్తోందని భాజపా ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఆరోపించారు. ఐటీఐఆర్‌ ఫేజ్‌-1 కింద కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత నిధుల కంటే ఎక్కువే ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పనులు చేయకుండా కేంద్రాన్ని తప్పుపడుతోందని విమర్శించారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్‌ బహిరంగ చర్చకు రావాలని కోరారు. లేని పక్షంలో ఐటీఐఆర్‌ ప్రాజెక్టు ఫేజ్‌-1 కింద రూపొందించిన డీపీఆర్‌, కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఈ మేరకు విలేకరులతో మాట్లాడారు.  బీహెచ్‌ఈఎల్‌ కూడలి అభివృద్ధికి కేంద్ర సర్కారు రూ.12 వందల కోట్లు మంజూరు చేసిందన్నారు. మహేశ్వరంలోని మన్సాన్‌పల్లిలో ఏర్పాటు చేసిన సైన్స్‌ పార్కుకు కేంద్రం రూ.150 కోట్లు, ఈ-సిటీ అభివృద్ధికి రూ.400 కోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని