logo

14న వీర జవాన్ల దినోత్సవం నిర్వహించాలి

దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా నిర్వహించే ‘వాలంటైన్‌ డే’ను బహిష్కరించి, పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల స్మరణార్థం ఫిబ్రవరి 14న ‘వీర జవాన్ల’ దినోత్సవంగా జరుపుకోవాలని విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌లు పిలుపునిచ్చాయి.

Published : 08 Feb 2023 02:40 IST


గోడ ప్రతులను ఆవిష్కరిస్తున్న ప్రతినిధులు

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా నిర్వహించే ‘వాలంటైన్‌ డే’ను బహిష్కరించి, పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల స్మరణార్థం ఫిబ్రవరి 14న ‘వీర జవాన్ల’ దినోత్సవంగా జరుపుకోవాలని విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌లు పిలుపునిచ్చాయి. మంగళవారం కోఠిలోని పరిషత్‌ రాష్ట్ర కార్యాలయంలో వీహెచ్‌పీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పండరీనాథ్‌, బజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ శివరాములు ప్రతినిధులతో కలిసి వీర జవాన్ల కార్యక్రమం గోడప్రతులను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. యువతను జాగృతం చేసేందుకు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో సదస్సులు నిర్వహిస్తామన్నారు. వీహెచ్‌పీ ప్రముఖ్‌లు జగదీశ్వర్‌జీ, శ్రీకాంత్‌, భరత్‌వంశీ, బజరంగ్‌దల్‌ ప్రముఖ్‌లు అభిషేక్‌, ప్రవీణ్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని