logo

కనుల పండువగా సమతా కుంభ్‌

శంషాబాద్‌ మండలం, శ్రీరామనగరంలో సమతా కుంభ్‌-2023 ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి.

Published : 08 Feb 2023 02:40 IST

చిన్నారులతో మాట్లాడుతున్న చిన జీయర్‌స్వామి

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ మండలం, శ్రీరామనగరంలో సమతా కుంభ్‌-2023 ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఆరో రోజు.. మంగళవారం ఉదయం రుత్విజులు నిర్వహించిన సుప్రభాతం, ఆరాధన, సేవాకాలం, నిత్య పూర్ణాహుతి, బలిహరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. చిన జీయర్‌ స్వామి పర్యవేక్షణలో జరిగిన ఉత్సవ మూర్తుల డోలోత్సవాలను తిలకించిన భక్తులు పులకించారు. సాయంత్రం విష్ణు సహస్రనామ స్త్రోత్ర సామూహిక పారాయణం, సాకేత రామచంద్ర స్వామికి హనుమద్వాహన సేవ, 18 దివ్య దేశాధీశులకు 18 గరుడ సేవలు, తిరు వీధి సేవ, మంగళాశాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి జరిగాయి.  దేవనాధ జీయర్‌ స్వామి, అహోబిల జీయర్‌ స్వామి, భక్తులు పాల్గొన్నారు.
నేటి కార్యక్రమాలు ః బుధవారం ఉదయం 11.30 గంటలకు కల్హారోత్సవం, సామూహి పుష్పార్చన ః మధాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4.30 వరకు భగవద్గీతలో వేద విద్యార్థుల మేథస్సుపై పరీక్షలు నిర్వహిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు