logo

ఔషధ మొక్కలపై ఉమ్మడి అధ్యయనం

 ఎత్తైన ప్రదేశాల్లో పెరిగే అరుదైన ఔషధ మొక్కలను గుర్తించి వాటి నుంచి బయోయాక్టివ్‌ సమ్మేళనాల వెలికితీతపై సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ హైదరాబాద్‌, యూనివర్సిటీ ఆఫ్‌ లద్దాఖ్‌ (యూఓఎల్‌) మంగళవారం అవగాహన ఒప్పందం  కుదుర్చుకున్నాయి.

Published : 08 Feb 2023 02:40 IST

పత్రాలను చూపుతున్న ప్రొ.మెహతా, డా.శ్రీనివాస్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌:  ఎత్తైన ప్రదేశాల్లో పెరిగే అరుదైన ఔషధ మొక్కలను గుర్తించి వాటి నుంచి బయోయాక్టివ్‌ సమ్మేళనాల వెలికితీతపై సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ హైదరాబాద్‌, యూనివర్సిటీ ఆఫ్‌ లద్దాఖ్‌ (యూఓఎల్‌) మంగళవారం అవగాహన ఒప్పందం  కుదుర్చుకున్నాయి. లద్దాఖ్‌లోని స్థానికుల జీవనోపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అమలు చేయగలిగే సాంకేతికతలపై యూఓఎల్‌ బృందంతో కలిసి శాస్త్రవేత్తలు పని చేస్తారని ఐఐసీటీ డైరెక్టర్‌ డా.డి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.  ప్రధానంగా లద్దాఖ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో పెరిగే ఔషధ మొక్కల నుంచి బయోయాక్టివ్‌ సమ్మేళనాలను వేరుచేయడంపై ఐఐసీటీ ప్రత్యేక శ్రద్ధ వహించనుందని వివరించారు. యూవోఓల్‌ వైస్‌ఛాన్సలర్‌ ప్రొ.మెహతా, ప్రొ.అశోక్‌వర్మ, రిజిస్ట్రార్‌ డా.రియాజ్‌ ఎం.కె.ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని