logo

13న జాతీయ రహదారి దిగ్బంధం: మందకృష్ణ

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈనెల 13న హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి దిగ్భంధం చేసి తీరుతామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ స్పష్టం చేశారు.

Published : 08 Feb 2023 02:40 IST

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న మందకృష్ణ తదితరులు

బౌద్ధనగర్‌, న్యూస్‌టుడే: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈనెల 13న హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి దిగ్భంధం చేసి తీరుతామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌ పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని చెప్పిన ప్ర£ధాని మోదీ తొమ్మిదేళ్లవుతున్నా.. మాదిగ, మాదిగ ఉపకులాల ఆవేదనను అర్థం చేసుకోవటం లేదని ఆరోపించారు. భాజపా చేసిన జాప్యం కారణంగా ఈ తొమ్మిదేళ్లలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో వేలాది మంది మాదిగ, మాదిగ ఉపకులాల యువతకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. 11న ఆదిలాబాద్‌లో అమిత్‌షా మాదిగల ఆగ్రహం చవిచూస్తారన్నారు. తమ ఆవేదన అర్థం చేసుకోనందుకే.. జాతీయ రహదారి దిగ్భంధం చేస్తున్నట్లు ప్రకటించారు. వర్గీకణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు. మాదిగ సమాజం మొత్తం ఈనెల 13న రోడ్డెక్కాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని