విద్యుత్తు వాహన రంగంలో ఆవిష్కరణలు రావాలి
పర్యావరణ పరిరక్షణలో కీలకంగా నిలిచే విద్యుత్తు వాహన రంగంలో ఆవిష్కరణలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు.
టీహబ్‌లో కేస్ మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ ఛాలెంజ్ పోటీల విజేతలతో జయేశ్ రంజన్ తదితరులు
రాయదుర్గం, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణలో కీలకంగా నిలిచే విద్యుత్తు వాహన రంగంలో ఆవిష్కరణలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఈ మొబిలిటీ వీక్‌లో భాగంగా కేస్ (కనెక్టెడ్, ఆటోనామస్, షేర్డ్, ఎలక్ట్రిక్) మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ ఛాలెంజ్ పేరుతో నిర్వహించిన విద్యుత్తు వాహనాలు, అనుబంధ రంగాల అంకుర సంస్థల పోటీలను రాయదుర్గం టీ హబ్‌లో మంగళవారం నిర్వహించారు. తుదిపోటీలో విజేతలకు ఆయన బహుమతులను ప్రదానం చేసి మాట్లాడారు. జెడ్ ఎఫ్ రేస్ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ సస్చా రికానెక్, అపోలో టైర్స్ మార్కెటింగ్ హెడ్ విక్రమ్ గర్గా, టీవీఎస్ మోటర్ మైక్రో మొబిలిటీ హెడ్ సంజీవ్ పి., స్టెల్లంటిస్ బిజినెస్ హెడ్ మమతా చామర్తి, ఐఐటీ హైదరాబాద్ టి హాన్ డైరెక్టర్ ప్రొ.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
విజేతలు వీరే.. విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌లోని సమస్యలకు ఆధునిక పరిష్కారాలు చూపిస్తున్న ఐ-ఎలక్ట్రిక్ అంకురం మొదటి స్థానంలో నిలిచి రూ.10 లక్షల నగదు బహుమతి, దివ్యాంగులకు సరికొత్త విద్యుత్తు వీల్‌ఛైర్ రూపొందించిన నియోమోషన్ సంస్థ ద్వితీయ స్థానంతో రూ.5 లక్షలు అందుకున్నాయి. విద్యుత్తు వాహనరంగానికి సాంకేతిక సహాయం అందించే హాలా మొబిలిటీ, బ్యాటరీల వేడిని తగ్గించే అడియబాటిక్, హైడ్రోజన్‌ను వినియోగించి నడిచే సైకిల్ కమ్యూనిటీ ఎనర్జీ వాయు, సోడియం అయాన్ బ్యాటరీలకు క్యాథోడ్‌లను రూపొందించిన ఆట్రాల్, డ్రైవర్ రహిత ట్రాక్టర్‌ల సంస్థ ఆటో ఎన్‌ఎక్స్‌టీ అంకుర సంస్థలు పోటీల తుది పోరు పాల్గొన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్‌సభ సచివాలయం
-
Politics News
‘షాపూర్జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’
-
Ap-top-news News
తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Sports News
కోహ్లి దంపతుల ‘సేవ’.. కొత్త ఎన్జీవోకు శ్రీకారం
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
Sports News
Rishabh Pant: రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం ఇవ్వనున్న దిల్లీ క్యాపిటల్స్!