logo

విషం కక్కుతున్నాయి

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని పారిశ్రామికవాడల్లోని కొన్ని ఫార్మా కంపెనీలు, రంగుల తయారీ సంస్థలు, భారీ యంత్రాల కంపెనీలు రసాయనవ్యర్థాలను నేరుగా జలవనరుల్లోకి డంప్‌ చేస్తున్నాయి.

Published : 09 Feb 2023 01:58 IST

పరిశ్రమల నుంచి నేరుగా జలవనరుల్లోకి రసాయనాలు
ఈనాడు, హైదరాబాద్‌

మృతి చెందిన గేదె

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని పారిశ్రామికవాడల్లోని కొన్ని ఫార్మా కంపెనీలు, రంగుల తయారీ సంస్థలు, భారీ యంత్రాల కంపెనీలు రసాయనవ్యర్థాలను నేరుగా జలవనరుల్లోకి డంప్‌ చేస్తున్నాయి. కొద్దిరోజుల కిందట మేడ్చల్‌ సమీపంలోని చెరువులోకి వదిలిన రసాయన వ్యర్థాలు పంటపొల్లాలోకి వెళ్లగా.. వాటిని తాగిన గేదె చనిపోయింది. గ్రేటర్‌ పరిధిలోని 185 చెరువుల్లో 70 శాతం రసాయన వ్యర్థాలతో విషతుల్యమవుతున్నాయి.
కాటేదాన్‌.. జీడిమెట్ల.. మేడ్చల్‌.. కాటేదాన్‌, జీడిమెట్ల, మేడ్చల్‌ పారిశ్రామిక వాడల్లో 800కు పైగా ఫార్మా, రసాయన, రంగుల పరిశ్రమలున్నాయి. చాలా ఫార్మా కంపెనీలు రసాయన వర్థ్యాలను నగర శివార్లలోని చెరువుల్లో డంప్‌ చేస్తున్నాయి. ప్రత్యేకంగా ట్యాంకర్లను ఏర్పాటు చేయించుకొని, వ్యర్థజలాలను పారబోసేందుకు పారిశ్రామిక వాడల్లోని కెమికల్‌ మాఫియాతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఒక ట్యాంకర్‌ వ్యర్థజలాల శుద్ధికి రూ.లక్షల్లో ఖర్చవుతుండగా... మాఫియా వ్యక్తులకు రూ.50 వేలిస్తే సరిపోతుంది. జీడిమెట్ల నుంచి కుత్బుల్లాపూర్‌, సూరారం, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్‌ పరిసర ప్రాంతాలకు రాత్రివేళ వచ్చి రసాయనాలను చెరువుల్లో వదులుతున్నారు.

చేతులెత్తేసిన కాలుష్య నియంత్రణ మండలి

కాటేదాన్‌, రాజేంద్రనగర్‌ పరిసర ప్రాంతాల్లోని 6 చెరువులు, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌ చెంత 8 చెరువులు కాలుష్య కాసారాలయ్యాయి. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్‌, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మిన్నకుండిపోతున్నారు. ప్రేమావతిపేట్‌ చెరువు, నూర్‌మహమ్మద్‌ కుంట, శామీర్‌పేటపెద్దచెరువు, దుర్గం చెరువు, మీరాలంచెరువుల్లో పరిమితికి మించి కాలుష్యముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని