logo

పాతవే.. సరికొత్తగా..

పాతవే.. ఇప్పుడు సరికొత్తగా వినియోగంలోకి వస్తున్నాయి. నగరంలోని చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్‌ ముందు ఉన్న రెండు బోగీలు రెస్టారెంట్‌గా మారుతున్నాయి. వీటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు.

Published : 09 Feb 2023 01:58 IST

రెస్టారెంట్‌గా మీటర్‌గేజ్‌ రైలు బోగీలు

ఈనాడు - హైదరాబాద్‌ : పాతవే.. ఇప్పుడు సరికొత్తగా వినియోగంలోకి వస్తున్నాయి. నగరంలోని చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్‌ ముందు ఉన్న రెండు బోగీలు రెస్టారెంట్‌గా మారుతున్నాయి. వీటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు.

థీమ్‌ రెస్టారెంటుగా..

కాచిగూడలో ‘హెరిటేజ్‌ ఆన్‌ వీల్స్‌’గా మీటర్‌గేజ్‌ పట్టాలపై ఉన్న రెండు బోగీలు సరికొత్త థీమ్‌తో హోటల్‌గా  మారుతున్నాయి. ఏసీతో ఉండే వీటిలో వండిన వాటిని వడ్డిస్తారా.. లేక కొంత బాగాన్ని కిచెన్‌గా మారుస్తారా అనే విషయంపై స్పష్టత రాలేదు. ఈ నెలాఖరు నాటికి నగరవాసులకు రుచులను అందించనున్నాయి.

బోగీల చరిత్ర ఇది..

ఈ బోగీలు ఉన్న రైలును 1991లో చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ రాజస్థాన్‌ టూరిజం అభివృద్ధి సంస్థ కోసం  రూపొందించారు. ‘ప్యాలెస్‌ ఆన్‌ వీల్స్‌’ పేరిట సేవలందించింది. 1996లో దీనిని గుజరాత్‌ టూరిజం వాళ్లకు అందజేశారు. ‘రాయల్‌ ఓరియంటల్‌ ఎక్స్‌ప్రెస్‌’గా 2008 వరకు సేవలందించింది. అదే ఏడాది రాజస్థాన్‌ పర్యాటక అభివృద్ధి సంస్థకు అందజేశారు. జైపూర్‌ - బికనీర్‌ - రామగఢ్‌ సేఖావతి మార్గంలో మళ్లీ ‘హెరిటేజ్‌ ఆన్‌ వీల్స్‌’ పేరిట ఆ లైను బ్రాడ్‌గేజ్‌గా మారే వరకు(2009) సేవలు అందజేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లాలాగూడ వర్కుషాపులో 2015 ఏప్రిల్‌ 16న జరిగిన రైల్వే వారోత్సవాలు సందర్భంగా జరిగిన హెరిటేజ్‌ ఎగ్జిబిషన్‌లో అప్పటి జీఎం శ్రీవాస్తవ దీనిని ఆవిష్కరించారు. తర్వాత దీనిలోని రెండు బోగీలను కాచిగూడ రైల్వే స్టేషన్‌ ముందుకు తీసుకువచ్చి.. హెరిటేజ్‌ ఆన్‌ వీల్స్‌గా ప్రదర్శనకు ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని