logo

‘ఐటీ రంగంలో హైదరాబాద్‌ దూసుకెళ్తోంది’

ఐటీ రంగంలో హైదరాబాద్‌ నగరం దూసుకెళ్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ దేశవ్యాప్తంగా గతేడాది నాలుగు లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తే ఒక్క హైదరాబాద్‌ నగరంలో లక్షన్నర కొత్త ఉద్యోగాలు వచ్చాయని ఆయన అన్నారు.

Published : 09 Feb 2023 01:58 IST

మాదాపూర్‌, న్యూస్‌టుడే

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చంద్రశేఖర్‌ దంపతులకు జీవన సాఫల్య అవార్డును

అందజేస్తున్న మంత్రి కేటీఆర్‌, చిత్రంలో హైసియా అధ్యక్షురాలు మనీషాసాబు

టీ రంగంలో హైదరాబాద్‌ నగరం దూసుకెళ్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ దేశవ్యాప్తంగా గతేడాది నాలుగు లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తే ఒక్క హైదరాబాద్‌ నగరంలో లక్షన్నర కొత్త ఉద్యోగాలు వచ్చాయని ఆయన అన్నారు. హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైసెస్‌ అసోసియేషన్‌(హైసియా) 30వ వార్షిక సమావేశం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ఎగుమతుల్లో కూడా హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ గణనీయమైన వృద్ధి సాధిస్తోందన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్‌ మాట్లాడుతూ ఐటీ పరిశ్రమను తెలంగాణలోని ఇతర ముఖ్యపట్టణాలను విస్తరించేందుకు ప్రభుత్వపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం ఐటీ రంగానికి విశేషకృషి చేసిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆర్‌.చంద్రశేఖర్‌కు మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా జీవితసాఫల్య పురస్కారం అందజేశారు. ఐటీ రంగంలో మంచి పురోగతి సాధించిన పలు ఐటీ కంపెనీలకు హైసియా అవార్డ్సును మంత్రి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హైసియా అధ్యక్షురాలు మనీషాసాబు, ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ జనరల్‌ అరవింద్‌కుమార్‌, సైయేంట్‌ కంపెనీ వ్యవస్థాపక ఛైర్మన్‌ బి.వి.ఆర్‌. మోహన్‌రెడ్డి, ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డేబాషిస్‌ ఛటర్జీ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని