ఫార్మా కంపెనీలో రాజుకున్న అగ్గి!
జీడిమెట్లలోని ఓ ఫార్మా కంపెనీలో సాల్వెంట్స్ తయారు చేస్తున్న క్రమంలో చెలరేగిన మంటలతో ఓ కార్మికుడు మృతి చెందగా, ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు.
ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకుంటున్న జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ పవన్
జీడిమెట్ల, న్యూస్‌టుడే: జీడిమెట్లలోని ఓ ఫార్మా కంపెనీలో సాల్వెంట్స్ తయారు చేస్తున్న క్రమంలో చెలరేగిన మంటలతో ఓ కార్మికుడు మృతి చెందగా, ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. పారిశ్రామిక వాడలోని ‘శోధన ల్యాబొరేటరీస్ ప్రైవేటు లిమిటెడ్’ సంస్థలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంతో కార్మికులు భయాందోళన చెందారు. ఒడిశాకు చెందిన కార్మికులు మేఘనాథ్(36), జైదేవ్, శశిధర్ కొన్నేళ్ల నుంచి సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. యంత్రంలో సాల్వెంట్స్ తయారు చేస్తున్న సమయంలో మోతాదుకు మించి రసాయనాల్ని వినియోగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యంత్రం పక్కనే విధులు నిర్వహిస్తున్న వారికి మంటలంటుకున్నాయి. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మేఘనాథ్ మృతి చెందగా జైదేవ్‌కి 70 శాతం గాయాలు, శశిధర్‌కి 40 శాతం కాలిన గాయాలైనట్లు సమాచారం. నిబంధనలు పాటించకుండా ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన స్థలాన్ని ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ ఎం.పవన్, పీసీబీ అధికారులు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
WHO Vs Musk: మస్క్ X టెడ్రోస్.. ట్విటర్ వార్..!
-
Politics News
KTR: ఒక్క తెలంగాణలోనే పెట్టుబడికి రూ.10 వేలు.. పంట నష్టపోతే రూ.10 వేలు : కేటీఆర్
-
Politics News
Bandi Sanjay: నాకెలాంటి నోటీసూ అందలేదు.. నేను ఇవాళ రాలేను: సిట్‌కు బండి సంజయ్ లేఖ
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్ ఉత్తరాఖండ్‌లో ఉన్నాడా..? నేపాల్ సరిహద్దుల్లో పోస్టర్లు..
-
Sports News
Shashi Tharoor: సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్
-
Movies News
Ajith Kumar: హీరో అజిత్ ఇంట విషాదం