logo

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా

మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థుల కడుపులు నింపుతున్న తమ బతుకులు చాలీచాలని జీతాలతో దారుణంగా సాగుతున్నాయని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.

Published : 09 Feb 2023 01:57 IST

ఆందోళన చేస్తున్న కార్మికులను  అడ్డుకుంటున్న పోలీసులు

హిమాయత్‌నగర్‌ న్యూస్‌టుడే: మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థుల కడుపులు నింపుతున్న తమ బతుకులు చాలీచాలని జీతాలతో దారుణంగా సాగుతున్నాయని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం హిమాయత్‌నగర్‌లోని ఎ.ఐ.టి.యు.సి. భవనం వద్ద సంఘం ఆధ్వర్యంలో కనీస వేతనాలు అందించాలని, ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలనే డిమాండ్లతో ధర్నా నిర్వహించారు. ఎ.ఐ.టి.యు.సి. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మహ్మద్‌ యూసుఫ్‌, ఎస్‌.బాలరాజ్‌, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం అధ్యక్షురాలు ప్రేమ్‌ పావని మాట్లాడుతూ.. తమ సమస్యలను ప్రస్తావించేందుకు ధర్నా చేస్తామంటే పాలకులు అనుమతించకపోవడం దుర్మార్గమని చెప్పారు. గ్యాస్‌ సిలిండర్‌, కోడిగుడ్ల ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో.. వాటిని ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ఈ సందర్భంగా కార్మికులు అసెంబ్లీ వైపు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలను నారాయణగూడ పోలీసులు అడ్డుకొన్నారు. సంఘం నేతలు వీఎస్‌.బోస్‌, ఉజ్జిని రత్నాకరరావు, ఎఐవైఎఫ్‌ నేత వలీఉల్లాఖాద్రీ, శ్రామిక మహిళా ఫోరం నేత సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని