logo

నార్కోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలున్న రాష్ట్రం మనదే

నార్కోటిక్స్‌ బ్యూరో, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. సమీకృత కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(ఐసీసీసీ)లో బుధవారం హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌(హెచ్‌సీఎస్‌సీ) సమావేశం నిర్వహించారు.

Published : 09 Feb 2023 01:57 IST

సమావేశంలో సీవీ ఆనంద్‌, ఏఆర్‌ శ్రీనివాస్‌ తదితరులు

జూబ్లీహిల్స్‌: నార్కోటిక్స్‌ బ్యూరో, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. సమీకృత కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(ఐసీసీసీ)లో బుధవారం హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌(హెచ్‌సీఎస్‌సీ) సమావేశం నిర్వహించారు. ప్రస్తుత, కొత్త సభ్యులు పాల్గొన్నారు. సీపీ మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో(టీఎన్‌ఏబీ), సైబర్‌ సెక్యూరిటీబ్యూరోలను ఏర్పాటుచేసిందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, సైబర్‌ క్రైం ముప్పును పరిష్కరించడానికి ఇవి కృషి చేస్తాయని వివరించారు. హెచ్‌సీఎస్‌సీలో యాంటీ నార్కోటిక్స్‌ ఫోరం ప్రారంభించవచ్చన్నారు. హెచ్‌సీఎస్‌సీ సెక్రటరీ జనరల్‌ చైతన్య మహిళలు, సైబర్‌, ట్రాఫిక్‌, ఫిజికల్‌ సెక్యూరిటీ తదితర ఫోరంల కార్యకలాపాలు వివరించారు. అదనపు సీపీ(క్రైమ్స్‌, సిట్‌) ఏఆర్‌శ్రీనివాస్‌, అదనపు కమిషనర్‌(ట్రాఫిక్‌) సుధీర్‌బాబు, సభ్యులు ముజాహిద్‌ఆలం, భాస్కర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, కీర్తి, రామకృష్ణారావు, సతీష్‌బాబు, సుప్రియ, గీత గోటి, సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు