logo

ముగిసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం క్రీడాపోటీలు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర కళాశాలల పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీలలో రాష్ట్రంలోని వివిధ కళాశాలలకు చెందిన మొత్తం 570మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Published : 09 Feb 2023 01:57 IST

ఛాంపియన్‌షిప్‌ దక్కించుకున్న రాజేంద్రనగర్‌ వ్యవసాయ కళాశాల విద్యార్థులు

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర కళాశాలల పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీలలో రాష్ట్రంలోని వివిధ కళాశాలలకు చెందిన మొత్తం 570మంది విద్యార్థులు పాల్గొన్నారు. బాలుర క్రికెట్‌ పోటీల ఫైనల్స్‌లో రాజేంద్రనగర్‌ కళాశాల విద్యార్థులు విజయం సాధించారు. జగిత్యాల విద్యార్థులు రెండోస్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో ఛాంపియన్‌షిప్‌ను అశ్వరావుపేట విద్యార్థులు దక్కించుకున్నారు. ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ను రాజేంద్రనగర్‌ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాజేంద్రనగర్‌ జోన్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యవసాయ విద్యార్థులు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రైతుల సమస్యలు తీర్చాలని సూచించారు. గెలుపొందిన విద్యార్థులకు, జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, అధికారులు డాక్డర్‌ వి.అనిత, డాక్టర్‌ జె.సత్యనారాయణ, డాక్టర్‌ రత్నకుమారి, డాక్టర్‌ జమునారాణి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని