logo

పద్దులో బీసీలకు అన్యాయం: జాజుల

రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం దోమలగూడ బీసీ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 09 Feb 2023 01:57 IST

మంత్రి కేటీఆర్‌ మాటలను సెల్‌ఫోన్‌లో  వినిపిస్తున్న జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

కవాడిగూడ, న్యూస్‌టుడే: రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం దోమలగూడ బీసీ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు 5 శాతం కేటాయించలేదని వాదించిన మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర బడ్జెట్‌లో రెండు శాతమే కేటాయించడం ద్వంద్వ వైఖరిని చాటిందన్నారు. కేటీఆర్‌ మాటలను మొబైల్‌లో వినిపించారు. బడ్జెట్‌లో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 13న రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలను ముట్టడించాలని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం, గ్రేటర్‌ అధ్యక్షుడు మాదేశీ రాజేందర్‌, బీసీ మహిళా సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు మణిమంజరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని