logo

‘ఏక్‌భారత్‌ - శ్రేష్ఠ భారత్‌’ విక్రమ్‌ ఉత్సవాలు 10 నుంచి

‘ఏక్‌భారత్‌  - శ్రేష్ఠ భారత్‌’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో జీడిమెట్ల హెచ్‌ఎంటీ మైదానంలో విక్రమ్‌ ఉత్సవాల నిర్వహణకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Published : 09 Feb 2023 01:57 IST

సమావేశంలో మహేశ్‌ పటేల్‌, జస్మత్‌పటేల్‌, రాహుల్‌ కొఠారి,

రితీశ్‌జాగిర్దార్‌, ముఖేశ్‌ చౌహాన్‌, ఘన్‌శ్యామ్‌పటేల్‌

గోల్నాక, న్యూస్‌టుడే: ‘ఏక్‌భారత్‌  - శ్రేష్ఠ భారత్‌’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో జీడిమెట్ల హెచ్‌ఎంటీ మైదానంలో విక్రమ్‌ ఉత్సవాల నిర్వహణకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం కాచిగూడలో భాజపా మధ్యప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ కొఠారి, హైదరాబాద్‌ గుజరాతీ సమాజ్‌ అధ్యక్షుడు మహేశ్‌ పటేల్‌, తెలంగాణ లవ్‌ఫర్‌ కౌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ జస్మత్‌పటేల్‌, ప్రాణిమిత్ర రమేశ్‌ జాగిర్దార్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి రితీశ్‌ జాగిర్దార్‌, అఖిల భారత జైన్‌ మైనార్టీ సమాఖ్య కన్వీనర్‌ ముఖేశ్‌ జైన్‌ చౌహాన్‌, ఉమియా పాటీదార్‌ సమాజ్‌ ప్రతినిధి ఘన్‌శ్యామ్‌పటేల్‌ తదితరులతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్‌ చౌహాన్‌ హాజరవుతారని తెలిపారు. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు రాజా విక్రమాదిత్య జీవిత చరిత్ర ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు