logo

దైవ కార్యాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

భగవద్గీత శ్లోకాల సారాంశాన్ని అవగతం చేసుకుని.. తమ జీవితాలకు అన్వయం చేసుకుని తరించాలని త్రిదండి రామానుజ చిన జీయర్‌ స్వామి పేర్కొన్నారు.

Published : 09 Feb 2023 01:57 IST

త్రిదండి రామానుజ చిన జీయర్‌ స్వామి

తెప్పోత్సవం సందర్భంగా ప్రవచిస్తున్న చిన జీయర్‌ స్వామి

శంషాబాద్‌, న్యూస్‌టుడే: భగవద్గీత శ్లోకాల సారాంశాన్ని అవగతం చేసుకుని.. తమ జీవితాలకు అన్వయం చేసుకుని తరించాలని త్రిదండి రామానుజ చిన జీయర్‌ స్వామి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం, శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న సమతా కుంభ్‌ ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధవారం వేద, ప్రజ్ఞ విద్యార్థులకు భగవద్గీతలో సూపర్‌ మెమొరీపై పరీక్షలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వేద, ప్రజ్ఞ విద్యార్థులను చిన జీయర్‌ అభినందించారు. వేద పండితులు కల్హారోత్సవం, సామూహిక పుష్పార్చన వైభవంగా చేశారు. సాయంత్రం క్షీర సాగర శయనుడికి 18 రూపాలలో తెప్పోత్సవం నిర్వహించారు. చిన జీయర్‌ స్వామి ప్రవచిస్తూ.. శ్రీరామనగరంలో జరుగుతున్న సమతా కుంభ్‌ ఉత్సవాలు చరిత్రాత్మకమన్నారు. దైవ కార్యాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని భగవంతుడి కృపకు పాత్రులు కావాలన్నారు. దేవనాధ జీయర్‌ స్వామి, అహోబిల జీయర్‌ స్వామి పాల్గొన్నారు.

నేటి కార్యక్రమాలు..  గురువారం ఉదయం 10 నుంచి సమతామూర్తి సువర్ణ రామానుజాచార్యులకు, 108 దివ్య దేశాలకు మర్యాద సమర్పణ ఆచార్య వరివస్య, సాయంత్రం 5 నుంచి 5.45 వరకు విష్ణు సహస్రనామ స్త్రోత్ర సామూహిక పారాయణం, ప్రత్యేక వేదికపై సామూహిక ఉపనయనాల ఉదకశాంతి, 6 నుంచి 8.30 వరకు సాకేత రామచంద్ర స్వామికి అశ్వ వాహన సేవ, 18 దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు, నిత్యపూర్ణాహుతి, తీర్థప్రసాద గోష్ఠి ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని