logo

మహనీయుల చరిత్ర భావితరాలకు అందించాలి

తెలుగు ప్రాంతాల అభివృద్ధితోపాటు కళారంగం, రాజకీయ రంగంలో విశేష కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు,  పౌల్ట్రీరంగ అభివృద్ధికి ఎంతగానో పాటుపడిన మన్నవ పెద్ద శేషయ్య సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, కోనేరు కోనప్ప, భాస్కర్‌రావు, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ అన్నారు.

Updated : 09 Feb 2023 02:11 IST

ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, కోనప్ప, భాస్కర్‌రావు, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌

షాద్‌నగర్‌ న్యూటౌన్‌, న్యూస్‌టుడే: తెలుగు ప్రాంతాల అభివృద్ధితోపాటు కళారంగం, రాజకీయ రంగంలో విశేష కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు,  పౌల్ట్రీరంగ అభివృద్ధికి ఎంతగానో పాటుపడిన మన్నవ పెద్ద శేషయ్య సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, కోనేరు కోనప్ప, భాస్కర్‌రావు, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ అన్నారు. రంగారెడ్డిజిల్లా షాద్‌నగర్‌ పురపాలిక పరిధి చటాన్‌పల్లిలోని ఎంపీ శేషయ్య కాలనీ (బీవీ.రావునగర్‌)లోని శేషయ్య నాగరత్నమ్మ కమ్యూనిటీహాలు వద్ద ఎన్టీఆర్‌, శేషయ్య నాగరత్నమ్మ దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. శేషయ్య నాగరత్నమ్మ దంపతుల విగ్రహాలను మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌.. ట్రస్టు, సేవా సమితి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ట్రస్టు అధ్యక్షుడు పాతూరి వెంకటరావు అధ్యక్షతన మిర్యాలగూడ, శేరిలింగంపల్లి, సిర్పూర్‌కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యేలు భాస్కరరావు, ఆరెకపూడి గాంధీ, కోనేరు కోనప్ప ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, శైలజాకిరణ్‌ మాట్లాడుతూ మహానుభావుల చరిత్రను భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు, శేషయ్య కుమారుడు శరత్‌, కమ్మ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రావు, సభ్యులు సాంబశివరావు, వసంతరావు, నాగేశ్వరరావు, సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలి.. పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని శైలజాకిరణ్‌ అన్నారు. గిట్టుబాటుధర లేక, పెరుగుతున్న మేత ధరలతో రైతులు ఎంతో సతమతమవుతున్నారని వివరించారు. వారి శ్రేయస్సుకు ప్రభుత్వంతో మాట్లాడి తమవంతు సహకారం అందించాలని సభావేదికపై ఉన్న ఎమ్మెల్యేలను ఆమె కోరారు. ఎంపీ శేషయ్యతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. కమ్యూనిటీ హాలు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ఆమె తిలకించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు