logo

మార్చి 18 నుంచి ‘భారత్‌ గౌరవ్‌ యాత్ర’ ప్రత్యేక రైలు

పర్యాటకాన్ని పెంపొందించేందుకు భారత రైల్వే భారత్‌ గౌరవ్‌ యాత్ర పేరిట ప్రత్యేక రైలు నడుపుతోంది. ఈ రైలులో 8 రోజులు పాటు 6 ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు దర్శించుకోవచ్చు.

Published : 09 Feb 2023 01:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: పర్యాటకాన్ని పెంపొందించేందుకు భారత రైల్వే భారత్‌ గౌరవ్‌ యాత్ర పేరిట ప్రత్యేక రైలు నడుపుతోంది. ఈ రైలులో 8 రోజులు పాటు 6 ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు దర్శించుకోవచ్చు. ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే యాత్రలో సందర్శక స్థలాలుగా పురి, కోణార్క్‌, గయ, వారణాసి, అయోధ్య, ప్రయోగ్‌రాజ్‌లు ఉన్నాయి. ‘దేఖో అప్నా దేశ్‌’లో భాగంగా ప్రతి ప్రయాణికుడికి 33 శాతం రాయితీ ఇస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

సికింద్రాబాద్‌లో ఈ రైలు మార్చి 18న మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతుంది. 8వ రోజు రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటారు. ఛార్జిల వివరాలకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు