logo

Hyderabad: అదృష్ట రాయి అంటూ.. రూ.2 కోట్లకు బేరం

అదృష్ట రాయి అంటూ మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 10 Feb 2023 07:45 IST

స్వాధీనం చేసుకున్న రాయి

చర్లపల్లి, కాప్రా, న్యూస్‌టుడే: అదృష్ట రాయి అంటూ మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా ఖాజీపేటకు చెందిన బి.చందు, యాప్రాల్‌కు చెందిన సాంబశివరావు అమాయకులను మోసం చేయడానికి కుట్ర పన్నారు. రాయి లోపల బ్యాటరీతో కూడిన లైటు అమర్చి.. నీళ్లలో వేయగానే కాంతి వచ్చేలా రూపొందించారు. సాగరకన్య నోటి నుంచి జారిపడిన అదృష్టరాయి అని.. జలకాంతగా పిలిచే దీన్ని ఇంట్లో ఉంచుకోవడంతో అద్భుత శక్తులు వస్తాయంటూ నమ్మించారు. కాప్రా ప్రాంతంలో రూ.2 కోట్లకు బేరం కుదిర్చారు. అమ్మేందుకు సిద్ధపడ్డారు. మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు రెక్కీ నిర్వహించి పట్టుకున్నారు. నిందితుల నుంచి రాయి, మూడు చరవాణులు, కారు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని