logo

Hyderabad: బెలగావి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వెళ్లాల్సిన బెలగావి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందంటూ ఫోను రావడంతో రైల్వే సిబ్బంది ఉలిక్కి పడ్డారు.

Updated : 23 Feb 2023 07:52 IST

రైలులో తనిఖీలు చేస్తున్న భద్రతా సిబ్బంది

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వెళ్లాల్సిన బెలగావి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందంటూ ఫోను రావడంతో రైల్వే సిబ్బంది ఉలిక్కి పడ్డారు. బుధవారం రాత్రి 9.30 గంటలకు ఫోను రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమైంది. హుటాహుటిన డాగ్‌ స్క్వాడ్‌, బాంబు స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. రాత్రి 11.15 గంటల వరకూ పరిశీలించి బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి ఈ 07335/36 నంబరు గల రైలు రాత్రి 10.20 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లా దేవరంపల్లి గ్రామస్థుడు బాలరాజు ఆటో డ్రైవర్‌. ఆ దగ్గరలోని పోలీసు స్టేషన్‌ సమీపంలో ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటూ.. రైలులో బాంబు ఉందంటూ మాట్లాడుకుంటుండగా.. బాలరాజు విని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాత్రి 11.36 గంటల సమయంలో రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్లింది. బాలరాజును విచారిస్తామని పోలీసులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని