logo

Hyderabad: కుక్కలు, కోతుల బెడద ఉంటే.. ఈ నంబరుకు కాల్‌ చేయండి: తలసాని

గ్రేటర్‌ పరిధిలో వీధికుక్కల సమస్యకు సత్వర పరిష్కారం చూపుతామని, ప్రత్యేక చర్యల కోసం ఎనిమిది బృందాలను రంగంలోకి దింపుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు.

Updated : 24 Feb 2023 07:31 IST

మాట్లాడుతున్న మంత్రి తలసాని

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలో వీధికుక్కల సమస్యకు సత్వర పరిష్కారం చూపుతామని, ప్రత్యేక చర్యల కోసం ఎనిమిది బృందాలను రంగంలోకి దింపుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో  ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘‘అంబర్‌పేటలో కుక్కకాటు దుర్ఘటన దురదృష్టకరం.  నెలరోజులపాటు ఎనిమిది బృందాలతో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి కుక్కలకు పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్సలు చేయిస్తాం. కోతులు, కుక్కలతో సమస్యలు ఉన్న వారు జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూము నంబరు 040 2111 1111కు ఫోన్‌ చేయండి. ఫిర్యాదుల కోసం మొబైల్‌ యాప్‌నూ అందుబాటులోకి తెస్తాం’’ అని తెలిపారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు