logo

మెడలో మెరిస్తే మాయమే!

అర్ధరాత్రి వేళ మహిళ ధైర్యంగా నడిచే రోజుల మాటేమిటోగాని పట్టపగలైనా ఆ పరిస్థితి కనిపించని దుస్థితి. మెడలో బంగారు హారం మెరిస్తే చాలు దొంగలు వెంటాడుతున్నారు.

Published : 10 Mar 2023 02:54 IST

మహిళలూ అప్రమత్తత అవసరం

ర్ధరాత్రి వేళ మహిళ ధైర్యంగా నడిచే రోజుల మాటేమిటోగాని పట్టపగలైనా ఆ పరిస్థితి కనిపించని దుస్థితి. మెడలో బంగారు హారం మెరిస్తే చాలు దొంగలు వెంటాడుతున్నారు. ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చి అంతే వేగంతో బంగారు గొలుసును తస్కరిస్తున్నారు. ఇటీవల రాచకొండ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి ఘటనలు తీవ్రమవుతున్నాయి. కొందరు యువకులు జల్సాలకు ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

ఇలా చేయండి

* మహిళలు వివిధ పనుల నిమిత్తం వీధుల్లోకి వచ్చేటప్పుడు, ఆలయాలకు వెళ్లే సమయంలో ఆభరణాలు ధరించి ఉంటే గమ్యం చేరేదాకా జాగరూకతతో వ్యవహరించాలి.

* సాధ్యమైనంత వరకు ఎక్కువ బంగారు నగలు లేకుండా జాగ్రత్త పడాలి.

* అత్యవసరమైతేనే తప్ప ఒంటరిగా రోడ్డుపై నడిచి వెళ్లే సాహసం చేయకూడదు. కుటుంబీకులు, సన్నిహితులను తీసుకెళ్లడం ఉత్తమం.

* అనుమానితులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 100కూ కాల్‌ చేయొచ్చు.

* నడిచే సమయంలో నగలు కనిపించకుండా చీర కొంగు కప్పుకోవడం ప్రధానం.

* మీ పరిధిలోని ఠాణా, సీఐ, ఎస్సైల ఫోన్‌ నంబరు తప్పనిసరిగా మీ వద్ద ఉండాలి.

* ఇంటి ఆవరణ శుభ్రం చేసేటప్పుడు పూర్తిగా పనుల్లో లీనమైపోకుండా.. ఆ వైపుగా తరచూ వచ్చివెళ్లే వారిని, కొత్తగా సంచరిస్తున్న అనుమానితులను గమనిస్తూ ఉండాలి.

ఒకరు నడుపుతుంటే.. : రోడ్డు వెంట నడుస్తూ వెళ్లే మహిళలే లక్ష్యంగా దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. ప్రతి సారి దొంగలు ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తుండడం గమనార్హం. ఓ వ్యక్తి నడుపుతుంటే మరొకరు వెనుక కూర్చొని హఠాత్తుగా వచ్చి మెడలో గొలుసును చాకచక్యంగా కత్తిరించి లాగడంలో నిమగ్నమవుతున్నాడు. తమను గుర్తించకుండా శిరస్త్రాణాన్ని ఉపయోగిస్తుండటం గమనార్హం.

న్యూస్‌టుడే, ఘట్క్‌కేసర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని