logo

ఉగ్ర కుట్ర నిందితులు కస్టడీకి తరలింపు

రాజధానిలో పేలుళ్ల కుట్ర నిందితులు నలుగురిని చంచల్‌గూడ జైలు నుంచి నాలుగు రోజుల కస్టడీకి శనివారం ఎన్‌ఐఏ అధికారులు తరలించారు.

Published : 19 Mar 2023 01:45 IST

చంచల్‌గూడ(హైదరాబాద్‌), న్యూస్‌టుడే: రాజధానిలో పేలుళ్ల కుట్ర నిందితులు నలుగురిని చంచల్‌గూడ జైలు నుంచి నాలుగు రోజుల కస్టడీకి శనివారం ఎన్‌ఐఏ అధికారులు తరలించారు. గత ఏడాది దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో వరుస పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో అరెస్టయిన వీరిని గతంలో సిట్‌, సీసీఎస్‌ అధికారులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. అబ్దుల్‌ జాహెద్‌ అలియాస్‌ మోటు, మహమ్మద్‌ సమీయుద్దీన్‌ అలియాస్‌ సమి, మాజ్‌ హసన్‌ ఫారూఖ్‌ అలియాస్‌ మాజ్‌ మహమ్మద్‌, కలీముద్దీన్‌ అలియాస్‌ అర్షద్‌ఖాన్‌లను ఎన్‌ఐఏ అధికారులు న్యాయస్థానం ఉత్తర్వులతో నాలుగు రోజుల కస్టడీకి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు