గొలుసుకట్టు ఉద్యోగం.. జీవితాలు ఆగం..!
‘క్యూ-నెట్’ పేరుతో డిగ్రీ, ఇంజినీరింగ్ చదివిన గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల్లోని యువతకు కొలువుల ఎరను చూపించారు.
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్, న్యూస్‌టుడే, నర్సంపేట: ‘క్యూ-నెట్’ పేరుతో డిగ్రీ, ఇంజినీరింగ్ చదివిన గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల్లోని యువతకు కొలువుల ఎరను చూపించారు. చాలాకాలంగా నడుస్తున్న ఈ క్యూ-నెట్ సంస్థ బండారం సికింద్రాబాద్ స్వప్నలోక్ అగ్ని ప్రమాదంతో వెలుగులోకి వచ్చింది. సంస్థలో అప్లియన్స్‌గా పిలిచే శ్రావణి, మనోజ్, శివ అనే ముగ్గురు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగుల చిరునామాలను తెలుసుకొని వారి చుట్టూ తిరిగేవారని తెలిసింది. శ్రావణిది మహబూబాబాద్ జిల్లా కాగా చాలా కాలంగా హైదరాబాద్‌లో ఉంటూ పనిచేస్తున్నట్లు సమాచారం.
బాధితులు ఎందరో.. తక్కువ డబ్బులు చెల్లిస్తే వేతనం, కమీషన్ తక్కువగా వస్తుందని నిర్వాహకులు చెప్పడంతో చాలా మంది నిరుద్యోగులు రూ.లక్షల్లో చెల్లించారు. నర్సంపేట, వరంగల్‌లో ఉండే స్నేహితులు ఆ సంస్థలో ఉద్యోగాలు చేస్తుండడంతో ఖానాపురం మండలం టేకులతండాకు చెందిన బానోతు శ్రావణి వారితో కలిసి ఆరు నెలల కిందట రూ.3 లక్షలు చెల్లించి చేరారు. నెలకు రూ.30 వేల వేతనం, రూ.30 వేలు కమీషన్ చొప్పున రెండు నెలలకు సంబంధించినవి ఇచ్చారని ఆమె మేనమామ, బంధువులు తెలిపారు.
* నర్సంపేట మండలం చంద్రాయపల్లికి చెందిన ఉప్పుల శివ మూడేళ్ల కిందట హైదరాబాద్‌లోని అతని బంధువుల సాయంతో రూ.1.50 లక్షలు చెల్లించి ఈ సంస్థలో చేరాడని అప్పటి నుంచి ఒక్క రూపాయి జీతం ఇవ్వలేదని అతని తల్లి రజిత, చెల్లెలు సింధు తెలిపారు.
* దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన వంగ వెన్నెల.. ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన అనిత, సమీప బంధువు ద్వారా రూ.2.30 లక్షలు చెల్లించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Dulquer Salmaan: సినిమాల్లోకి రావడానికి చాలా భయపడ్డా: దుల్కర్ సల్మాన్
-
Sports News
IPL 2023: ‘అతడు ఆరెంజ్ క్యాప్ గెలిస్తే దిల్లీ క్యాపిటల్సే ఛాంపియన్’
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు
-
India News
Opposition Protest: రోడ్డెక్కిన ప్రతిపక్ష ఎంపీలు.. దిల్లీలో తీవ్ర ఉద్రిక్తత
-
India News
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య..కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు
-
Politics News
Panchumarthi Anuradha : చంద్రబాబును కలిసిన పంచుమర్తి అనురాధ