logo

స్టాగ్‌ ఎంట్రీ కవర్‌ ఛార్జీ వసూలుపై అమ్నీషియా స్కైబార్‌కు జరిమానా

వినియోగదారుల నుంచి స్టాగ్‌ ఎంట్రీ, అప్‌ ఫ్రంట్‌ ఛార్జీలు వసూలు చేసి అనైతిక వ్యాపారానికి పాల్పడిన మాదాపూర్‌ అమ్నీషియా స్కైబార్‌కు వినియోగదారుల కమిషన్‌-3 రూ.5,000 జరిమానా విధించింది.

Published : 19 Mar 2023 01:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: వినియోగదారుల నుంచి స్టాగ్‌ ఎంట్రీ, అప్‌ ఫ్రంట్‌ ఛార్జీలు వసూలు చేసి అనైతిక వ్యాపారానికి పాల్పడిన మాదాపూర్‌ అమ్నీషియా స్కైబార్‌కు వినియోగదారుల కమిషన్‌-3 రూ.5,000 జరిమానా విధించింది. ఎల్లారెడ్డిగూడకు చెందిన సంజయ్‌ గతేడాది మార్చిలో స్నేహితులతో కలిసి మాదాపూర్‌ ఇనార్బిట్‌ మాల్‌లో ఉన్న అమ్నీషియా స్కైబార్‌కు వెళ్లారు. అయితే అక్కడి సిబ్బంది ‘స్టాగ్‌ ఎంట్రీ’ (తోడుగా మహిళ లేదంటూ) లేదంటూ లోపలికి వెళ్లాలంటే రూ.1500 (రూ.1,000 స్టాగ్‌ ఎంట్రీ కవర్‌ ఛార్జీలు, రూ.500 మ్యూజిక్‌ అండ్‌ బ్యాండ్‌, అప్‌ ఫ్రంట్‌ కవర్‌ ఛార్జీలు) చెల్లించాలంటూ బయటే ఆపేశారు. చేసేదేమీ లేక సంజయ్‌ అతడి స్నేహితులు రూ.6 వేలు చెల్లించారు. అనంతరం సేవాలోపంగా, అనైతిక వ్యాపారంగా పరిగణిస్తూ పరిహారం ఇప్పించాలంటూ హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన కమిషన్‌ వినియోగదారుల నుంచి ఎలాంటి స్టాగ్‌ ఎంట్రీ కవర్‌ ఛార్జీలు వసూలు చేయొద్దంటూ ప్రతివాద సంస్థను ఆదేశిస్తూ.. రూ.5 వేలు, 45 రోజుల్లో చెల్లించాలని తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని