logo

కోఠి, సీబీఎస్‌ నుంచి గచ్చిబౌలి అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయానికి సిటీ బస్సులు

ప్రయాణికుల సౌలభ్యం కోసం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌లో నూతనంగా ప్రారంభించిన ‘అమెరికన్‌ కాన్సులేట్‌’ కార్యాలయానికి బస్సులు...

Published : 19 Mar 2023 01:46 IST

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: ప్రయాణికుల సౌలభ్యం కోసం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌లో నూతనంగా ప్రారంభించిన ‘అమెరికన్‌ కాన్సులేట్‌’ కార్యాలయానికి బస్సులు నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌ రీజనల్‌ మేనేజర్‌(ఆర్‌ఎం) బి.వరప్రసాద్‌ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నగరంలోని బర్కత్‌పుర, ఫారుఖ్‌నగర్‌ డిపోల నుంచి 116ఎన్‌, 116జీ రూట్‌ నంబర్లతో ప్రతి రోజూ కోఠి, సీబీఎస్‌ నుంచి బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. కోఠి నుంచి బయలుదేరి మెహిదీపట్నం, టోలిచౌకి, దర్గా, నానక్‌రాంగూడ, క్యూసిటీ, అమెరికన్‌ కాన్సులెట్‌ మీదుగా గౌలిదొడ్డి వరకు నడుస్తున్నాయి. కోఠి నుంచి ప్రతి 12 నిమిషాల వ్యవధిలో బస్సు అందుబాటులో ఉంటుంది. కోఠి నుంచి మొదటి సర్వీసు ఉదయం 5.10 గంటలకు, చివరి సర్వీసు రాత్రి 9.16 గంటలకు, క్యూసిటీ అమెరికన్‌ కాన్సులేట్‌ నుంచి మొదటి సర్వీసు ఉదయం 5.02 గంటలకు, చివరి సర్వీసు రాత్రి 9.39 గంటలకు ఉంటుంది. ప్రతి రోజు ఆయా రూట్‌లో 60 ట్రిప్పులు నడుస్తాయని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని