logo

టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలి: భాజపా

ఉద్యోగ నియామక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీతో నిరుద్యోగుల, ప్రజల విశ్వసనీయత కోల్పోయిన టీఎస్‌పీఎస్సీని తక్షణమే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి...

Published : 19 Mar 2023 02:03 IST

ధర్నాలో మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, గౌతంరావు, వినోద్‌యాదవ్‌ భాజపా శ్రేణులు

నాంపల్లి, న్యూస్‌టుడే: ఉద్యోగ నియామక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీతో నిరుద్యోగుల, ప్రజల విశ్వసనీయత కోల్పోయిన టీఎస్‌పీఎస్సీని తక్షణమే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, భాజపా సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతంరావు డిమాండ్‌ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ శనివారం భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహించారు. భాజపా గోల్కొండ జిల్లా అధ్యక్షుడు పాండుయాదవ్‌, మహంకాళి జిల్లా అధ్యక్షుడు బి.శ్యాంసుందర్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి బి.సుభాష్‌, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వినోద్‌యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్‌, ఇతర నాయకులు, కార్యకర్తలు భాజపా రాష్ట్ర కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా తరలివచ్చారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు బలగాలు అడ్డుకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు