logo

‘అన్నమాచార్య సంకీర్తనల సేకరణ నిరంతరం సాగాలి’

‘అజ్ఞాతంలో ఉండిపోయిన అన్నమాచార్య సంకీర్తనల సేకరణ ఉద్యమం నిరంతరంగా కొనసాగాలని శాంతా బయోటెక్నిక్స్‌ అధినేత డాక్టర్‌ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి అన్నారు.

Published : 19 Mar 2023 02:03 IST

గ్రంథాన్ని ఆవిష్కరించిన వరప్రసాద్‌రెడ్డి, వోలేటి పార్వతీశం, సుధామా, వెంకట్‌ గరికపాటి తదితరులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘అజ్ఞాతంలో ఉండిపోయిన అన్నమాచార్య సంకీర్తనల సేకరణ ఉద్యమం నిరంతరంగా కొనసాగాలని శాంతా బయోటెక్నిక్స్‌ అధినేత డాక్టర్‌ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి శ్రీరామ సంస్థ ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతి మహోత్సవాల్లో భాగంగా అన్నమయ్య పద సాహిత్య విశ్లేషకులు, వెంకట్‌ గరికపాటి వ్యాఖ్యాన గ్రంథం ‘అన్నమయ్య జానపద జాజర’ ఆవిష్కరణ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో నిర్వహించారు. ఆవిష్కర్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ..తమ శాంతా బయోటెక్నిక్స్‌లోని ఇద్దరు పరిశోధకులతో అజ్ఞాతంలో ఉండిపోయిన ఎన్నో అన్నమాచార్య సంకీర్తనలను సేకరించే ఉద్యమానికి పూనుకున్నామన్నారు. ఇప్పటి వరకు 289 కీర్తనల్ని సేకరించి పుస్తక రూపంలో తీసుకొచ్చామన్నారు. ఈ కీర్తనలను తితిదేవారు అంగీకరించడానికి మూడేళ్లు పట్టిందన్నారు. మరో ప్రయత్నంలో 89 కీర్తనలు దొరికాయని, పుస్తక రూపంలోకి తీసుకురాబోతున్నామని వివరించారు. సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం అధ్యక్షోపన్యాసం చేయగా.. ఎస్‌బీఐ జీఎం ఎస్‌.గిరిధర్‌, సాహితీవేత్త సుధామా, సంగీత గురు రామాచారి, శ్రీరామ సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు చంద్రశేఖర్‌ గొర్తిలు మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు