logo

బీసీల సమగ్రాభివృద్ధికి కుల గణన దోహదం

జన గణనలోభాగంగా కుల గణన చేపట్టినప్పుడే బీసీ కులాల సమగ్రాభివృద్ధి జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు.

Published : 19 Mar 2023 02:03 IST

అభివాదం చేస్తున్న ఆర్‌.కృష్ణయ్య, వి.హనుమంత రావు, ప్రొ.కోదండరామ్‌, గుజ్జ కృష్ణ తదితరులు

గోల్నాక, న్యూస్‌టుడే: జన గణనలోభాగంగా కుల గణన చేపట్టినప్పుడే బీసీ కులాల సమగ్రాభివృద్ధి జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. బీసీలకు సంబంధించిన సమాచారం కులాలవారీగా అందుబాటులో ఉంటే.. సంక్షేమ పథకాల అమలు, నిధుల కేటాయింపు సాధ్యమవుతుందని తెలిపారు. శనివారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోలా జనార్దన్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన బీసీ ఉద్యోగ, కుల సంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ, బీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లను కల్పించాలని, ప్రైవేట్‌రంగంలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.  తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్నివర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలను కల్పించాలని పాలకులను కోరారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు, నేతలు భూపేశ్‌సాగర్‌, నందగోపాల్‌, రాజ్‌కుమార్‌, నీలం వెంకటేశ్‌, శారదాగౌడ్‌, దానకర్ణాచారి, కల్పన, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

‘చలో దిల్లీ’ని విజయవంతం చేయండి

నల్లకుంట: బీసీల డిమాండ్ల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఏప్రిల్‌ 3న తలపెట్టిన ‘చలో దిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం విద్యానగర్‌లోని బీసీభవన్‌లో జరిగిన సమావేశంలో సంబంధిత గోడపత్రికలను ఆవిష్కరించారు.  బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ లాల్‌కృష్ణ, గుజ్జ సత్యం, నీల వెంకటేష్‌, జిల్లపల్లి అంజి, వేముల రామకృష్ణ, పగిళ్ల సతీష్‌, నర్సింహగౌడ్‌, రావుల రాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని