logo

వైద్య విద్యార్థికి బీఎల్‌ఆర్‌ ట్రస్ట్‌ సాయం

మెడిసిన్‌ చదువుతున్న పేద విద్యార్థులను బీఎల్‌ఆర్‌ ట్రస్ట్‌ ఆదుకుంటుందని ట్రస్ట్‌ ఛైర్మన్‌ బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

Published : 19 Mar 2023 02:03 IST

విద్యార్థికి చెక్కు అందజేస్తున్న లక్ష్మారెడ్డి

కాప్రా, న్యూస్‌టుడే: మెడిసిన్‌ చదువుతున్న పేద విద్యార్థులను బీఎల్‌ఆర్‌ ట్రస్ట్‌ ఆదుకుంటుందని ట్రస్ట్‌ ఛైర్మన్‌ బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్‌ చక్రీపురంలో ఉండే పెరపు నర్సింహ, దేవమణి దంపతుల కుమారుడు ప్రశాంత్‌ మెడిసిన్‌లో 69వ ర్యాంతో ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో సీటు సాధించాడు. పేద కుటుంబం కావడంతో స్పందించిన లక్ష్మారెడ్డి శనివారం విద్యార్థికి రూ. లక్ష చెక్‌ను అందజేశారు. చదువు పూర్తయ్యేవరకు ఏటా ట్రస్ట్‌ ఫీజులు చెల్లిస్తుందని  హామీ ఇచ్చారు. ట్రస్ట్‌ ప్రతినిధి మహేష్‌, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని