logo

ప్రత్యేక లోక్‌అదాలత్‌ విజయవంతం

వ్యక్తులతో కానీ, సంస్థలతో కానీ వివాదాలు తలెత్తితే న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ప్రజా న్యాయపీఠం ద్వారా పరిష్కరించుకోవాలని సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి అన్నారు.

Published : 19 Mar 2023 02:03 IST

కార్యక్రమంలో మాట్లాడుతున్న శ్రీదేవి

రంగారెడ్డి జిల్లా కోర్టులు: వ్యక్తులతో కానీ, సంస్థలతో కానీ వివాదాలు తలెత్తితే న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ప్రజా న్యాయపీఠం ద్వారా పరిష్కరించుకోవాలని సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లాకోర్టుల్లోని న్యాయ సేవాసదన్‌లో ప్రత్యేక బ్యాంకు ప్రజా న్యాయపీఠం(లోక్‌అదాలత్‌) నిర్వహించారు.  ఈ ప్రజా న్యాయపీఠంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ, కోటక్‌ మహేంద్ర బ్యాంకులతో ఖాతాదారులకు ఉన్న వివాదాలను పరిష్కరించారు. 301 అపరిష్కృత ఖాతాల్లో బకాయిదారులకు తగినంత రాయితీ మంజూరు చేయించి, ఉభయులకూ ఆమోదయోగ్యమైన సత్వర పరిష్కారాన్ని చూపించారు. దీంతో ఆయా బ్యాంకు ఖాతాలలో బకాయిదారులు సుమారు రూ.2 కోట్లు చెల్లించారు. కార్యక్రమంలో బ్యాంకుల బకాయిదారులు, అధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని