logo

24న విద్యుత్తుసౌధ ముట్టడి: ఐకాస

రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగులకు వేతన సవరణతోపాటు ఆర్జిజన్స్‌ను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఈ నెల 24న విద్యుత్తుసౌధను ముట్టడించనున్నట్లు తెలంగాణ స్టేట్‌ పవర్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(ఐకాస) స్పష్టం చేసింది.

Published : 19 Mar 2023 02:03 IST

ప్రసంగిస్తున్న సాయిబాబా. చిత్రంలో ఐకాస ప్రతినిధులు

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగులకు వేతన సవరణతోపాటు ఆర్జిజన్స్‌ను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఈ నెల 24న విద్యుత్తుసౌధను ముట్టడించనున్నట్లు తెలంగాణ స్టేట్‌ పవర్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(ఐకాస) స్పష్టం చేసింది. శనివారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో.. ఐకాస సన్నాహక సమావేశం జరిగింది. ఐకాస ఛైర్మన్‌ సాయిబాబా మాట్లాడుతూ.. పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం తగదన్నారు. 1999 నుంచి 2004 వరకు నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలుతోపాటు ఆర్టిజన్స్‌ సిబ్బందిని సంస్థ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని కోరారు. ఉద్యోగులకు నగదు రహిత వైద్యసేవలను పూర్తి ఉచితంగా అందించాలన్నారు. సమావేశంలో 24 విద్యుత్తు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోపాటు ఐకాస కో-ఛైర్మన్‌ శ్రీధర్‌, కన్వీనర్‌ రత్నాకర్‌, కో-కన్వీనర్‌ బీసీరెడ్డి, సెంట్రల్‌ సర్కిల్‌ అధ్యక్షుడు అంజిరెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని