logo

దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలకు డిమాండ్‌

మహిళా నేతలపై భౌతికదాడికి పాల్పడ్డ పోలీసు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి విజ్ఞప్తి చేశారు.

Published : 19 Mar 2023 02:03 IST

సీవీ ఆనంద్‌కు వినతిపత్రం ఇస్తున్న గీతామూర్తి. చిత్రంలో భాజపా మహిళా మోర్చా నేతలు

కాచిగూడ, న్యూస్‌టుడే: మహిళా నేతలపై భౌతికదాడికి పాల్పడ్డ పోలీసు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. గురువారం గన్‌పార్కు వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి నిరసన తెల్పుతున్న మహిళా మోర్చా నేతలను పోలీసులు పాశవికంగా కొట్టారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో శనివారం మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్యామల, దత్తేశ్వరి తదితరులతో.. నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ను ఆయన కార్యాలయంలో కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు. పోలీసుల దాడిలో గాయాలపాలైన పలువురు మహిళా నేతలు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన దృష్టికి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని