logo

పేద మున్నూరుకాపు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన పేద మున్నూరుకాపు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ఇవ్వనున్నట్లు మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎంఆర్‌ వెంకట్రావు తెలిపారు.

Published : 19 Mar 2023 02:03 IST

మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ వెంకట్రావు. చిత్రంలో ట్రస్ట్‌బోర్డు సభ్యులు

గోల్నాక, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన పేద మున్నూరుకాపు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ఇవ్వనున్నట్లు మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎంఆర్‌ వెంకట్రావు తెలిపారు. నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన 1500 మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తామని పేర్కొన్నారు. శనివారం కాచిగూడలోని మున్నూరుకాపు సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో.. ట్రస్ట్‌బోర్డు సభ్యులు ఆకుల పాండురంగారావు, దడువై రాఘవేందర్‌రావు, పిల్లి శ్రీనివాస్‌రావు, మంద సూర్యప్రకాశ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం చేయూత అందిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీరామనవమి, తెలుగు నూతన సంవత్సరాది ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని