logo

వేద విద్య నేర్పే గురుకుల పాఠశాలలు అవసరం

హైందవ సమాజాన్ని కాపాడేందుకు భావితరాలకు సంప్రదాయ భారతీయ కళలు, సంస్కృతిని, వేద విద్యను బోధించేందుకు వేద గురుకుల పాఠశాలను నెలకొల్పడం అభినందనీయమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ పేర్కొన్నారు.

Published : 19 Mar 2023 02:11 IST

గురుకుల వేద పాఠశాలను ప్రారంభిస్తున్న జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, సచ్చిదానంద సరస్వతి స్వామి, అరబిందో ఫార్మా ప్రతినిధులు

శామీర్‌పేట, న్యూస్‌టుడే: హైందవ సమాజాన్ని కాపాడేందుకు భావితరాలకు సంప్రదాయ భారతీయ కళలు, సంస్కృతిని, వేద విద్యను బోధించేందుకు వేద గురుకుల పాఠశాలను నెలకొల్పడం అభినందనీయమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ పేర్కొన్నారు. శనివారం  శామీర్‌పేట మండలం పొన్నాల గ్రామంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రూ.3 కోట్లతో నిర్మించిన శ్రీశంకర గురుకుల వేద పాఠశాల వేదభవన్‌ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వేదాలను ఆధునిక ప్రపంచానికి అందించేందుకు పాఠశాలను ఏర్పాటు చేసి, ఉత్తమ సమాజ స్థాపనకు కృషి చేయటం అభినందనీయమన్నారు. ఇలాంటి  పాఠశాలలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ మాట్లాడుతూ.. గురుకుల వ్యవస్థలో వేద పారాయణం వేద పఠనాలు జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ధర్మపురి శ్రీమఠం తుని తపోవనం సచ్చిదానంద సరస్వతి స్వామి వేద పాఠశాలకు ఆశీర్వచనాలు అందించారు. ఫౌండేషన్‌ డైరెక్టర్‌ కె.నిత్యానందరెడ్డి,  ప్రత్యేక ఆహ్వానితులు భారత రక్షణ శాఖ సలహాదారులు జి.సతీశ్‌రెడ్డి, అరబిందో ఫార్మా నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కె.రఘునాథన్‌,  ఫౌండేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శివకుమారన్‌,  సీఎస్‌ఆర్‌ హెడ్‌ ఎస్‌.సదానందరెడ్డి, వేద పాఠశాల మేనేజింగ్‌ ట్రస్టీ వి.శ్రీరామ ఘనాపాఠి, వేద పండితులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని