logo

విద్యుత్తు ఉద్యోగుల సమస్యలు తీరుస్తాం

రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్‌సీతో పాటు ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌కు, అర్జిజన్ల కన్వర్షన్‌ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లామని త్వరలోనే పరిష్కారం కానున్నాయని జెన్‌కో...

Published : 19 Mar 2023 02:11 IST

మాట్లాడుతున్న జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ  ప్రభాకర్‌రావు

వెంగళ్‌రావునగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్‌సీతో పాటు ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌కు, అర్జిజన్ల కన్వర్షన్‌ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లామని త్వరలోనే పరిష్కారం కానున్నాయని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర పవర్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (1535) 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వెంగళరావునగర్‌ డివిజన్‌ జీటీఎస్‌ కాలనీలో నూతనంగా నిర్మించిన యూనియన్‌ భవనం ప్రారంభంతో పాటు సిల్వర్‌జూబ్లీ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య తిథులుగా సీఎండీతో పాటు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి హాజరయ్యారు. యూనియన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు గుర్తింపుగా మెడల్స్‌, జ్ఞాపికలను జన్‌కో మాజీ డైరెక్టర్‌ జి.వామనరావు అందజేశారు. కార్యక్రమంలో టీఎస్‌పీఈయూ (1535) సెంట్రల్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎ.వజీర్‌, డి.రాధకృష్ణ, జెన్‌కో అధ్యక్ష, కార్యదర్శులు పి.రాము, జి.కుమారస్వామి, ట్రాన్స్‌కో అధ్యక్ష కార్యదర్శులు బి.నగేష్‌, కె.రవి, ఎన్‌పీడీసీఎల్‌ అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, శ్రీనివాస్‌, ఎస్‌పీడీసీఎల్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.కె.కౌసర్‌పాషా, కె.సురేందర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని