వినయ్‌భానురెడ్డికి కన్నీటి వీడ్కోలు
విధి నిర్వహణలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లెఫ్టినెంట్ కర్నల్ ఉప్పల వినయ్‌భానురెడ్డికి శనివారం ఆర్మీ చీఫ్ మనోజ్‌పాండే, గవర్నర్ తమిళిసై నివాళి అర్పించారు.
కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న గవర్నర్ తమిళిసై
మల్కాజిగిరి, బొమ్మలరామారం, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లెఫ్టినెంట్ కర్నల్ ఉప్పల వినయ్‌భానురెడ్డికి శనివారం ఆర్మీ చీఫ్ మనోజ్‌పాండే, గవర్నర్ తమిళిసై నివాళి అర్పించారు. మల్కాజిగిరి దుర్గానగర్‌లో పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మనోజ్‌పాండే మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. మల్కాజిగిరి శాసనసభ్యుడు మైనంపల్లి హన్మంతరావు నివాళి అర్పించారు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, విజయలక్ష్మీ, భార్య స్వప్నరెడ్డి కుమార్తెలు అర్విక, అన్వితలను ఓదార్చారు. అనంతరం భౌతిక కాయాన్ని మల్కాజిగిరి నుంచి ఆర్మీ వాహనంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారానికి తరలించారు. అక్కడ వినయ్‌భానురెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆర్మీ అధికారుల లాంఛనాల నడుమ అంత్యక్రియలు చేశారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, తదితరులు పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు.
సైనికవందనం సమర్పిస్తున్నఆర్మీ చీఫ్ మనోజ్‌పాండే
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TS High Court: 500మందితో భాజపా మహాధర్నాకు హైకోర్టు అనుమతి
-
Politics News
Jaya Prakash Narayana: అనర్హతే ఆయుధం కావొద్దు..అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం: జేపీ
-
Politics News
YSRCP: నలుగురు వైకాపా ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
-
Politics News
Rahul Gandhi: రాహుల్‌పై వేటు.. ఇది చీకటి రోజు: విపక్షాల ఆగ్రహం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Amritpal Singh: భారత్‌పై అమృత్‌పాల్ విషకుట్ర ఇదీ..!