logo

జేఎన్‌టీయూ బంగారు కొండలు

జేఎన్‌టీయూ పదకొండో స్నాతకోత్సవంలో మొత్తం 46 మందికి బంగారు పతకాలు దక్కాయి. అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థుల్లో ముగ్గురు, నలుగురికి ఒకటికంటే ఎక్కువగా బంగారు పతకాలు వచ్చాయి.

Published : 19 Mar 2023 02:54 IST

స్నాతకోత్సవంలో 46 మందికి పతకాలు

పతకాలు పొందిన విద్యార్థినుల సంబరం

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, కూకట్‌పల్లి: జేఎన్‌టీయూ పదకొండో స్నాతకోత్సవంలో మొత్తం 46 మందికి బంగారు పతకాలు దక్కాయి. అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థుల్లో ముగ్గురు, నలుగురికి ఒకటికంటే ఎక్కువగా బంగారు పతకాలు వచ్చాయి. పతకాలు వచ్చిన వారిలో విద్యార్థినులే అధికం. స్నాతకోత్సవ అనంతరం వారు తమ మనోభావాలను ‘ఈనాడు’తో పంచుకున్నారు.


4 పతకాలతో మధురానుభూతి
- మౌక్తిక, మేడ్చల్‌

ఏకంగా 4 బంగారు పతకాలు రావడం మరువలేని మధురానుభూతినిచ్చింది. 2022లో జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌ సీఎస్‌ఈ పూర్తిచేశా. గవర్నర్‌ తమిళసై నుంచి తల్లిదండ్రుల సమక్షంలో పతకాలు తీసుకోవడం జీవితంలో గుర్తుండిపోయే క్షణం. చెప్పిన పాఠం ఏ రోజుకారోజు చదువుకోవడం ద్వారా పదోతరగతి నుంచి నుంచి బీటెక్‌ వరకు టాపర్‌గా నిలిచాను.


గర్వపడుతున్నా
- అఖిల రెడ్డి, కర్నూలు

3 బంగారు పతకాలు సాధించడాన్ని గర్వంగా భావిస్తున్నా.. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో సివిల్‌ పూర్తిచేశాను. ఇందుకుగాను సివిల్‌ టాపర్‌గా, రెండు ప్రయోజిత బంగారు పతకాలు దక్కించుకోవడం ఆనందంగా ఉంది. గర్వం ఎందుకంటే పేరు నిలబెట్టాలని తల్లిదండ్రులు అనేవారు. వారి సంతృప్తి మాటల్లో చెప్పలేను.


కష్టానికి ఫలితం దక్కింది
- శ్రీజ, ఈసీఐఎల్‌

సాధారణంకంటే ఎక్కువగా సన్నద్ధమై పరీక్షలు రాశాను. కష్టానికి తగిన ఫలితం దక్కింది.  3 పతకాలు రావడంతో సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చానన్న సంతృప్తిఉంది. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ కోర్సు పూర్తిచేశాను. ఇష్టపడి చదివే ఈ ఘనతను సాధించాను.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని