పుణ్యక్షేత్రాలు చుట్టొచ్చేలా.. భారత్ గౌరవ్ రైలు
దేశంలోని విశిష్ట ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బయలుదేరిన తొలి ‘భారత్ గౌరవ్’ టూరిస్టు రైలును సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో డోలు కళాకారుల ప్రదర్శన
రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: దేశంలోని విశిష్ట ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బయలుదేరిన తొలి ‘భారత్ గౌరవ్’ టూరిస్టు రైలును సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలులో ప్రయాణించే యాత్రికులకు కూచిపూడి నృత్యకళాకారులు సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగతం పలికడంతో స్టేషన్ ఆవరణ అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ రైలు బయలుదేరుతున్న సందర్భంగా ఐఆర్‌సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రజనీ హసిజా, ఇతర సీనియర్ రైల్వే అధికారులతో కలిసి జీఎం అరుణ్‌కుమార్‌జైన్ యాత్రికులకు స్వాగత కిట్‌లు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ... యాత్రికులు సాంస్కృతికపరమైన పలు పుణ్య క్షేత్రాలను సందర్శించడానికి ఈ రైలు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జాన్‌ప్రసాద్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్‌కుమార్ గుప్తా, జీజీఎంఐఆర్ సీటీసీ పి.రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
భారత్ గౌరవ్ రైలు వద్ద ద.మ.రైల్వే జీఎం అరుణ్కుమార్‌జైన్, ఇతర అధికారులు
పర్యటన ఇలా..: ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 8 రాత్రులు, 9 పగళ్లు ఈ యాత్ర కొనసాగుతుంది. పూరి, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లాంటి పుణ్యక్షేత్రాలను చుట్టిరానుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలోని నిర్ధారిత ముఖ్యస్టేషన్‌లలో ఆగుతుంది. ప్రయాణికులకు ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందజేసేందుకు క్యాటరింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు
-
India News
Opposition Protest: రోడ్డెక్కిన ప్రతిపక్ష ఎంపీలు.. దిల్లీలో తీవ్ర ఉద్రిక్తత
-
India News
లండన్‌లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య..కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు
-
Politics News
Panchumarthi Anuradha : చంద్రబాబును కలిసిన పంచుమర్తి అనురాధ
-
General News
CAG: రూ.6,356 కోట్లు మురిగిపోయాయి: ఏపీ ఆర్థికస్థితిపై కాగ్ నివేదిక
-
Movies News
Venkatesh: ఇప్పుడు టర్న్ తీసుకున్నా.. ‘రానా నాయుడు’పై వెంకటేశ్ కామెంట్