logo

చూసొద్దాం.. రాష్ట్రపతి నిలయం

భాగ్యనగర సిగలో మరో పర్యాటక ప్రాంతం వచ్చి చేరనుంది. సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి విడిది ఇప్పుడు ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

Published : 19 Mar 2023 02:54 IST

ఈ నెల 23 నుంచి తిలకించేందుకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌:, బొల్లారం, న్యూస్‌టుడే: భాగ్యనగర సిగలో మరో పర్యాటక ప్రాంతం వచ్చి చేరనుంది. సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి విడిది ఇప్పుడు ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఉగాది పర్వదినం ఈ నెల 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు.  రాష్ట్రపతి నిలయాన్ని తిలకించేందుకు గురువారం నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభమైంది. ఈ నెల 23 నుంచి తిలకించవచ్చు. సంవత్సరం పొడవునా  సందర్శించే అవకాశం కల్పించారు.

రాచరిక దర్పణం..

సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి నిలయం ఆనాటి రాచరికపు ఠీవికి దర్పం పడుతోంది. బ్రిటీషు వారి పాలనలో అప్పటి వైస్రాయ్‌ నివాసంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత నిజాం ప్రభువులు దీనిని స్వాధీన పరచుకున్నారు. స్వాతంత్య్రానంతరం 1950లో కేంద్ర ప్రభుత్వం రూ.60 లక్షలకు కొనుగోలు చేసి దక్షిణాదిలో రాష్ట్రపతికి విడిదిగా తీర్చిదిద్దారు. రాష్ట్రపతి నిలయం దిల్లీతో పాటు హైదరాబాద్‌లోని బొల్లారం, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని సిమ్లాలో రాష్ట్రపతి రిట్రీట్‌లు ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లోని స్థానిక ప్రజా సమస్యలపై ఒక అవగాహన కోసమని దక్షిణాది రాష్ట్రాల వారి కోసం హైదరాబాద్‌లో ఈ విడిది ఏర్పాటు చేశారు.  వనమూలికా తోటను అభివృద్ధి చేసి అరుదైన ఆయుర్వేద మొక్కలను ఇక్కడ పెంచుతున్నారు.

ఆన్‌లైన్లో టిక్కెట్లు..

రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించాలనుకునే వారు https://visit.rashtrapatibhavan.gov.in/ వెబ్‌సైట్లో టిక్కెట్లు కొనుక్కోవచ్చు. ఎనిమిదేళ్లలోపు చిన్నారులకు ప్రవేశం ఉచితం. సాధారణ పౌరులకు రూ.50, విదేశీయులకు రూ.250 టక్కెట్‌ ధర నిర్ణయించారు. సోమవారం, ప్రభుత్వ సెలవు రోజుల్లో ప్రవేశం ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు