logo

ప్లాస్టిక్‌ గోదాముల్లో అగ్ని ప్రమాదం

బహదూర్‌పుర పరిధి మీరాలం ఫిల్టర్‌బెడ్‌ అన్సారీ రోడ్డుకు ఆనుకుని ఉన్న నాలుగు ప్లాస్టిక్‌ వ్యర్థాల గోదాముల్లో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Published : 19 Mar 2023 02:54 IST

గోదాముల్లోంచి ఎగసిపడుతున్న మంటలు

ఫలక్‌నుమా: బహదూర్‌పుర పరిధి మీరాలం ఫిల్టర్‌బెడ్‌ అన్సారీ రోడ్డుకు ఆనుకుని ఉన్న నాలుగు ప్లాస్టిక్‌ వ్యర్థాల గోదాముల్లో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ముందు ఒక గోదాములో మంటలు చెలరేగి.. ఆపై మరో మూడింటికీ వ్యాపించాయి. రెండు కిలోమీటర్ల వరకు పొగ వ్యాపించింది. కాలాపత్తర్‌ పోలీసులు, 15 ఫైర్‌ఇంజన్లు చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.గోదాముల్లో ఉన్న రెండు డీసీఎంలు దగ్ధమయ్యాయి. అక్రమంగా నిర్వహిస్తున్న  గోదాములపై కేసులు నమోదు చేసిన  పోలీసులు.. యజమానులను అదుపులోకి తీసుకున్నారు.

పరీక్ష కేంద్రం కావడంతో.. గోదాముల పక్కనే ఉన్న మైనార్టీ బాలికల ప్రభుత్వ పాఠశాలకూ మంటలు వ్యాపించాయి. ఇంటర్‌ పరీక్ష కేంద్రమైన ఈ పాఠశాలకు శనివారం దాదాపు 300 మంది విద్యార్థులు వచ్చి, ఇబ్బంది పడ్డారు. అప్రమత్తమైన అధికారులు సమీపంలోని ఎంజే ఫంక్షన్‌హాల్లో ఏర్పాట్లు చేసి పరీక్షలు రాయించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు